Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెజాన్ ప్రైమ్ ఆద‌ర‌ణ‌లో పరిగెత్తు పరిగెత్తు

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (16:45 IST)
parigettu parigettu
ఈమధ్యనే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో అలరించింది సినిమా  'పరిగెత్తు పరిగెత్తు'. విమర్శకుల ప్రశంశలు అందుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో మంచి కలెక్షన్లు అందుకుని సూపర్ హిట్ సినిమా గా నిలవగా ఈ సినిమా తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమ్ అవుతూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటూ ఉన్నది. సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య హీరో హీరోయిన్ లుగా నటించిన ఈ సినిమా కి రామకృష్ణ తోట దర్శకత్వం వహించగా ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్ పతాకంపై ఏ యామిని కృష్ణ నిర్మించారు.
 
నిర్మాత యామిని కృష్ణ మాట్లాడుతూ.. థియేటర్లలో విడుదలై మంచి పేరు సంపాదించుకున్న  'పరిగెత్తు పరిగెత్తు' సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కూడా విడుదలై ప్రేక్షకుల మన్ననలను పొందుతుంది. మా సినిమా కి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తి తో ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా నిర్మిస్తాను. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నారు. 
 
దర్శకుడు రామకృష్ణ తోట మాట్లాడుతూ, మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మా సినిమా అందరికి ఇంత బాగా నచ్చడం సంతోషంగా ఉంది. నిర్మాత నమ్మకాన్ని నిలబెట్టినందుకు సంతోషంగా ఉంది. ధియేటర్ లలో సినిమాలు విడుదల చేయడానికి భయపడుతున్న సమయంలో మా సినిమా ను ధియేటర్ లలో విడుదల చేసి ధైర్యం చేశాము. ప్రేక్షకులు కూడా సినిమాను చాలా బాగా ఆదరించారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో కూడా మా సినిమా కి మంచి పేరొస్తుంది. నేను ఇంత మంచి సినిమా చేయడానికి సహాయపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments