Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున ''మన్మథుడు''లా హోస్ట్ చేస్తారు.. వాళ్లు తికమకపడతారు (Video)

Webdunia
బుధవారం, 10 జులై 2019 (10:58 IST)
మన్మథుడు-2లో నటిస్తున్న అక్కినేని నాగార్జున ప్రస్తుతం టాప్ రేటింగ్ షో బిగ్ బాస్ మూడో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్-3 అక్కినేని నాగార్జున యాంకరింగ్‌పై..  తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.


చిన్న రామయ్య(జూనియర్ ఎన్టీఆర్) మాసీగా చేశాడని, సీజన్-2ను నాని క్లాసీగా చేశాడని కానీ నాగ్ ‘మన్మథుడు’లా చేశారని తాజాా ప్రోమోను బట్టి తెలుస్తోందని వ్యాఖ్యానించారు. 
 
తాజాగా హోస్ట్ విషయంలో మాటీవీ క్లారిటీ ఇస్తూ.. బిగ్ బాస్-3కి సంబంధించిన ప్రోమోలను విడుదల చేసింది. ఈ ప్రోమోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ప్రోమోలను బట్టి చూస్తే.. నాగార్జున బిగ్ బాస్-3కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని ఖరారైపోయింది. 
 
దీనిపై పరుచూరి మాట్లాడుతూ.. 14 మంది వ్యక్తిత్వాలను బయట కూర్చొన్న వ్యక్తి విశ్లేషించడం సాధారణ విషయం కాదని, కానీ చిన్న రామయ్య దానిని అవలీలగా చేస్తే.. నాని హోస్టింగ్‌ ద్వారా ఈ షోను చాలా క్లాసీగా, అద్భుతంగా నడిపాడని తెలిపారు. 
 
ఇక నాగార్జున ‘మన్మథుడు’లా చేశారని ప్రోమోని బట్టి అర్థమవుతోందన్నారు. ఈ కార్యక్రమం చూసే మహిళా ప్రేక్షకులు, బిగ్ బాస్ ఇంట్లో ఉండే కంటెస్టెంట్లను చూడాలా? లేదంటే నాగ్‌ని చూడాలో అర్థం కాక తికమక పడతారని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నాగ్‌తో పాటు కంటెస్టంట్లందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments