Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ ఆవిష్క‌రించిన పరంపర 2 వెబ్ సిరీస్ ట్రైలర్

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (17:07 IST)
Parampara 2 poster
డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సీజన్ 2 ట్రైలర్ వచ్చేసింది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కాబోతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను స్టార్ హీరో రామ్ చరణ్ విడుదల చేశారు. పరంపర 2 ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందని ట్వీట్ చేసిన రామ్ చరణ్, టీమ్ అందరికీ బెస్ట్ విశెస్ తెలిపారు.
 
ట్రైలర్ చూస్తే ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాగా పరంపరం 2 వెబ్ సిరీస్ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ యుద్ధం ఎవరి కోసం మొదలుపెట్టావో గుర్తుంది కానీ ఎందుకోసం మొదలుపెట్టావో గుర్తు లేదు అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఫ్రీడమ్ కోసం, మా నాన్న దగ్గర లాకున్న అధికారం కోసం, పోగొట్టుకున్న పేరు, కోల్పోయిన జీవితం అన్నీ తిరిగి కావాలి అంటూ నవీన్ చంద్ర చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. నవీన్ చంద్ర, జగపతి బాబు, శరత్ కుమార్ పాత్రల మధ్య  హోరాహోరి ఘర్షణ ఆకట్టుకుంటోంది. ఓ రియల్ రివేంజ్ యాక్షన్ డ్రామా ట్రైలర్ లో ఆవిష్కృతమైంది. మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సెకండ్ సీజన్ ఆకట్టుకుంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. జూలై 21 నుంచి 'పరంపర' సీజన్ 2 స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Talliki Vandanam: తల్లికి వందనంతో ఆరు కీలక సంక్షేమ పథకాలు అమలు.. నారా లోకేష్

Chandrababu: మార్చి 5,6 తేదీలలో మరోసారి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు

బంగారు నిధుల కోసం 14 యేళ్ల బాలికను నరబలికి సిద్ధం చేశారు (Video)

Leopard: అలిపిరి నడకదారిపై కనిపించిన చిరుతపులి -భయాందోళనలో భక్తులు (Video)

వాట్సాప్‌లో ముద్దు ఎమోజీ పంపించిన స్నేహితుడు.. అనుమానంతో ఇద్దరిని హత్య చేసిన భర్త!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments