Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

పిల్లల్ని కనటంపై ఉపాసన: ఆరోగ్యంగా ఉండి కూడా పిల్లలు కనకూడదనుకుంటే?

Advertiesment
Upasana, Ramcharan
, సోమవారం, 4 జులై 2022 (12:58 IST)
మెగా కోడలు ఉపాసనకు పెళ్లై పదేళ్లు గడిచాయి.  తాజాగా ఉపాసనకు తరచుగా ఒక ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ఇంకా ఉపాసన-చెర్రీ దంపతులకు ఇంకా పిల్లలు లేరు. 
 
తాజాగా ఉపాసన తనకు పిల్లలు కనడం లేదన్న దానిపై ఓపెన్ అయ్యారు. ఆధ్యాత్మిక గురువు సద్గురుతో జరిగిన కార్యక్రమంలో ఉపాసన కొణిదెల పాల్గొంది. 
 
ఈ కార్యక్రమంలో ఉపాసన సద్గురుని అనేక ప్రశ్నలు అడిగింది. ఆశ్చర్యకరంగా తాను పిల్లలని కనడం గురించి కూడా సద్గురు వద్ద ఉపాసన ప్రశ్నించింది.
 
ఉపాసన మాట్లాడుతూ.. నేను వివాహం చేసుకుని పదేళ్లు అవుతోంది. నా జీవితం చాలా హ్యాపీగా సాగుతోంది. నా ఫ్యామిలీని నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను. సద్గురుని ప్రశ్నిస్తూ RRR అంటే మీరు సినిమా అనుకునేరు అది కాదు. R రిలేషన్, R రీ ప్రొడ్యూస్, R రోల్ ఇన్ లైఫ్.
  
దీనికి సద్గురు ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. రిలేషన్ షిప్ అది నీ పర్సనల్.. దాని గురించి నేను మాట్లాడను. ఇక రీ ప్రొడ్యూస్ విషయానికి వస్తే.. ఆరోగ్యంగా ఉండి కూడా పిల్లలు కనకూడదు అని నిర్ణయించుకున్న వారిని నేను అభినందిస్తాను. 
 
ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా 10 కోట్లు సమీపిస్తోంది. సమానం అంతరించిపోతున్న జీవులం కాదు. ఇంకా ఎక్కువవుతున్నామన్నారు.
 
నెటిజన్స్ ఉపాసన అడిగిన ప్రశ్నకు రకరకాలుగా స్పందిస్తున్నారు. పిల్లల గురించి ఓపెన్‌గా ఉపాసన అడిగి ధైర్యం చేసింది అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

RC 15 గురించి కైరా అద్వానీ ఏమన్నదో తెలుసా?