Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపిచంద్ ''పంతం'' ట్రైలర్ భలేగుందే.. వీడియో మీ కోసం..

గోపిచంద్ ''పంతం'' త్వరలో విడుదల కానుంది. వరుస ఫ్లాప్‌లతో నిరాశతో వున్న ఫ్యాన్స్‌కు పంతం ద్వారా హిట్ ఇచ్చేందుకు గోపిచంద్ రెడీ అయిపోతున్నాడు. చక్రి దర్శకత్వం వహించిన పంతం సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ను

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (12:08 IST)
గోపిచంద్ ''పంతం'' త్వరలో విడుదల కానుంది. వరుస ఫ్లాప్‌లతో నిరాశతో వున్న ఫ్యాన్స్‌కు పంతం ద్వారా హిట్ ఇచ్చేందుకు గోపిచంద్ రెడీ అయిపోతున్నాడు. చక్రి దర్శకత్వం వహించిన పంతం సినిమా నుంచి తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. గోపీచంద్ మార్క్ యాక్షన్ సీన్స్ పైనే ఈ ట్రైలర్‌ను కట్ చేశారు.
 
"ఒకడికి మంచి జరగాలంటే ఆ ఫైల్ మీద పదిమంది సంతకాలు పెట్టే పద్ధతి మారితేనే గాని సామాన్యుడికి ఏ సాయం అందదు" "అవినితి చేసే ఒక నాయకుణ్ణి అరెస్ట్ చేస్తే మాత్రం బంద్‌లు చేస్తాం.. ధర్నాలు చేస్తాం.. బస్సులు తగలబెట్టేస్తాం అంటూ ప్రతి ఒక్కడూ రోడ్డుకెక్కేస్తాడు. వాడు కాజేస్తున్నది నీ అన్నాన్ని.. నీ భవిష్యత్తుని.. నీ బతుకునురా.. " అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. 
 
వచ్చెనెల 5వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఇంకా హీరోయిన్ మెహ్రీన్, గోపిచంద్‌ల మధ్య లవ్ సీన్స్ బాగున్నాయి. గోపిచంద్‌ను వెంటబడి మరి మెహ్రీన్ ప్రేమించే సన్నివేశాలు ఈ ట్రైలర్లో కనిపిస్తాయి. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

రాజకీయాలు పూర్తిస్థాయి ఉద్యోగం కాదు : సీఎం యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments