Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త నుంచి వీణామాలిక్ విడాకులు తీసేసుకుంది.. ఇక బాలీవుడ్‌లో కనిపిస్తుందా?

పాకిస్థానీ నటి వీణామాలిక్‌ భర్త నుంచి విడాకుల తీసుకుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోతో భారత ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ షోతో ఆమెకు పాపులారిటీ రావడంతో బాలీవుడ్ అవకాశాలు అమ్మడి

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (13:47 IST)
పాకిస్థానీ నటి వీణామాలిక్‌ భర్త నుంచి విడాకుల తీసుకుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షోతో భారత ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ షోతో ఆమెకు పాపులారిటీ రావడంతో బాలీవుడ్ అవకాశాలు అమ్మడి తలుపులు తట్టాయి. పలు సినిమాల్లో శృంగార పాత్రల్లో నటించిన వీణా మాలిక్.. తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత అసద్ ఖటక్ అనే వ్యాపారవేత్తను 2013లో పెళ్లి చేసుకుంది. 
 
అనంతరం పూర్తిగా కుటుంబానికే అంకితమైంది. కానీ గత కొంతకాలంగా మళ్లీ సినిమాల్లో నటించేందుకు వీణా మాలిక్ ప్రయత్నిస్తోంది. కానీ సినిమాల్లో నటించేందుకు భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఆమెకు అడ్డు తెలిపారు. దీంతో ఆయన నుంచి విడిపోయేందుకు అమ్మడు సిద్ధమైంది. 
 
విడాకుల కోసం లాహోర్ కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంసో అసద్‌కు కోర్టు సమన్లు పంపింది. ఆ సమన్లకు అసద్ స్పందించని పక్షంలో వీణామాలిక్‌కు అనుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. చట్టపరంగా విడాకులు మంజూరు చేసింది. దీంతో వీణామాలిక్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఇకపై వీణా మాలిక్ బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Inter student : గుండెపోటుతో తెలంగాణ విద్యార్థి మృతి.. కారణం ఏంటంటే?

భార్యాభర్తల బంధం ఎంతగా బీటలు వారిందో తెలిసిపోతోంది : సుప్రీంకోర్టు

క్యాబ్‌లో వెళ్తున్న టెక్కీలకు చుక్కలు చూపించిన మందు బాబులు.. ఏం చేశారంటే? (video)

నేను కన్నెర్ర చేస్తే చస్తారు: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి హెచ్చరికలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

వాతావరణ మార్పులు నిశ్శబ్ద డిహైడ్రేషన్‌కి దారితీస్తోంది: వైద్యులు హెచ్చరికలు

తర్వాతి కథనం
Show comments