Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావత్ టీజర్.. జనవరి 25న విడుదల.. భన్సాలీ ప్రొడక్షన్స్ ప్రకటన

పద్మావతి సినిమా పద్మావత్‌గా మారింది. రాజ్‌పుత్ మహారాణుల గౌరవానికి భంగం కలిగించే సన్నివేశాలు ఇందులో వున్నాయని ఆందోళనలు వెల్లువెత్తాయి. అయితే ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఆందోళ‌న‌ల కార‌ణంగా సిన

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (16:26 IST)
పద్మావతి సినిమా పద్మావత్‌గా మారింది. రాజ్‌పుత్ మహారాణుల గౌరవానికి భంగం కలిగించే సన్నివేశాలు ఇందులో వున్నాయని ఆందోళనలు వెల్లువెత్తాయి. అయితే ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమవుతోంది. ఆందోళ‌న‌ల కార‌ణంగా సినిమా విడుద‌ల‌కు అంగీకారం తెల‌ప‌డం కోసం సీబీఎఫ్‌సీ చ‌రిత్ర‌కారుల స‌హాయం కూడా తీసుకుంది. వారి స‌ల‌హా మేర‌కు ఓ ఐదు మార్పుల‌ు చేసింది. 
 
ఈ స‌వ‌ర‌ణ‌ల‌కు నిర్మాత‌లు ఒప్పుకుంటేనే సినిమా విడుద‌ల‌కు అంగీక‌రించిన‌ట్లు సీబీఎఫ్‌సీ చైర్మ‌న్ ప్ర‌సూన్ జోషీ ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా స్వల్ప మార్పులతో మరో నాలుగు సవరణలు సీబీఎఫ్‌సీ సూచించింది. ఈ సినిమా ప్రారంభంలో డిస్‌ క్లైమర్ ప్రదర్శించడం.. సతి ఆచారాన్ని ప్రోత్సహించేలా ఉండకూడదని పేర్కొన్నారు. 
 
అలాగే ఘూమర్ పాటలు కొన్ని మార్పులు చేశారు. ఈ స‌వ‌ర‌ణ‌ల‌తో సినిమా ఇప్ప‌టికే విడుదకు సిద్ధం కాగా, పేరులో మార్పుతో ఉన్న చిత్రం ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ఈ నేపథ్యంలో పద్మావత్ చిత్రం జనవరి 25న విడుదల చేయనున్నట్లు భన్సాలీ ప్రొడక్షన్స్ ప్రకటించింది. హిందీ, తమిళ్, తెలుగు భాషాల్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments