Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనాల్ని మార్నింగ్ షోకి తీసుకురావాలనేది మా టార్గెట్: దర్శకుడు మేర్లపాక గాంధీ

Webdunia
బుధవారం, 2 నవంబరు 2022 (16:16 IST)
Merlapaka Gandhi
హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల తాజా చిత్రం లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్. వెంకట్ బోయనపల్లి  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు మేర్లపాక గాంధీ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.
 
 ఎ ఎం బీ మాల్ లో ప్రమోషన్ ప్లాన్ ఎవరిది ?
ఎ ఎం బీలో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని షూట్ చేయడానికి వెళ్లాం. అయితే సినిమా వస్తుందని ఎంతమందికి తెలుసనే ఒక ఆలోచన వచ్చి షూట్ చేయమని చెప్పాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
 
లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్టొరీ ఐడియా ఎప్పుడు వచ్చింది ?
లాక్ డౌన్ సమయంలో అందరికీ తీరిక దొరికింది. అప్పుడే చాలా మంచి యూట్యూబ్ కంటెంట్ కి అలవాటు పడ్డారు. ఆ సమయంలో ఎలాగూ బయటికి వెళ్ళలేం కాబట్టి కనీసం ట్రావెల్ వీడియోస్ చూస్తే బయటికి వెళ్ళిన ఫీలింగ్ వుంటుందని ఎక్కువగా ట్రావెల్ వ్లాగ్ వీడియోస్ చూశాను. అది చాలా నచ్చింది. ప్రదేశాలు గురించి, వాటి చరిత్ర గురించి చెప్పడం చాలా ఇంట్రస్టింగా అనిపించింది. ఒక యూట్యుబర్ కథ చేస్తే బావుంటుందనే ఆలోచన మొదలైయింది. ట్రావెల్ వ్లాగర్  కి వున్న కష్టాలు, ప్రమాదాలు, సవాళ్ళు బ్యాక్ డ్రాప్ లో సినిమాని ప్లాన్ చేశాం.
 
ట్రావెల్ వ్లాగ్, యూట్యుబర్ లైఫ్ తో లిమిటెడ్ ఆడియన్స్ రిలేట్ చేసుకుంటారు కదా ? కామన్ ఆడియన్స్ కి ఈ కథ ఎంత రిలేటెడ్ గా వుంటుంది ?
లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ చాలా హిలేరియస్ గా వుంటుంది. హీరో, హీరోయిన్  ఇద్దరూ ట్రావెల్ వ్లాగర్స్ . వీరి మధ్య ఫైట్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ట్రావెల్ వీడియోలు షూట్ చేసే క్రమంలో ఎలాంటి ప్రమాదం ఎదురుకున్నారనేది కూడా చాలా ఇంటరెస్టింగా వుంటుంది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకూ ఒక లాఫ్ రైడ్ లా వుంటుంది. అండర్ కరెంట్ గా ఒక సమస్య రన్ అవుతూనే .. ఆ పరిస్థితి నుండి వచ్చే సిట్యువేషనల్ కామెడీ అద్భుతంగా వుంటుంది.
 
మీ సినిమాల్లో స్క్రీన్ ప్లే స్పెషల్ ఎట్రాక్షన్ కదా.. మరి ఇందులో ఎలా వుంటుంది ?
లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్క్రీన్ ప్లే డిఫరెంట్ గా వుంటుంది. ప్రతి పదిహేను నిమిషాలకు కథలో ఒక చేంజ్ ఓవర్, మలుపు వుంటుంది.  సిట్యువేషనల్ కామెడీ ప్రధాన ఆకర్షణగా వుంటుంది.
 
సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా లీడ్ రోల్స్ లో ఎలా చేశారు ?
సంతోష్ శోభన్ తో ఏక్ మినీ కథ చేశాను. అందులో తన నటన బాగా నచ్చింది. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ లో ఒక యూట్యుబర్ గా యంగ్ యాక్టర్ కావాలని సంతోష్ తో కథ చెప్పడం జరిగింది. తనకి చాలా నచ్చింది. అలాగే జాతిరత్నాలు తర్వాత ఫారియా ఈ సినిమా చేసింది. తను సహజంగా ఎలా వుంటుందో సినిమాలో కూడా అలానే కనిపించింది. ఇద్దరూ పర్ఫెక్ట్ గా సరిపోయారు.
 
సుదర్శన్, బ్రహ్మాజీ పాత్రల గురించి ?
సుదర్శన్ ట్రావెల్ వ్లాగ్ షూట్ చేసే డివోపీ గా దాదాపు సినిమా అంతా ఉంటాడు. ఈ పాత్ర లో చాలా ఫన్నీగా ఉంటాడు. ఇందులో పిపిఎఫ్ అనే గ్యాంగ్ వుంటుంది. దానికి హెడ్ గా కనిపిస్తారు బ్రహ్మాజీ. చాలా రోజుల తర్వాత బ్రహ్మాజీ గారు అద్భుతంగా చేసిన క్యారెక్టర్ అని నాకు అనిపించింది. ఆయన పాత్ర కూడా దాదాపుగా సినిమా అంతా వుంటుంది. చాలా లైట్ హార్టెడ్ గా సరదాగా ఎంజాయ్ చేసే హిలేరియస్ ఎంటర్ టైనర్ ఇది.
 
ప్రభాస్ గారు ఈ సినిమా కోసం ఆసక్తి చూపిస్తున్నట్లు వున్నారు ?
యూవీ క్రియేషన్స్, ప్రభాస్ గారు మాకు వెరీ క్లోజ్. వారి బ్యానర్ లో సినిమాలు చేశాం. తర్వాత కూడా చేయబోతున్నాను. నా, సంతోష్ శోభన్ సినిమా అంటే తప్పకుండా యూవీ క్రియేషన్స్ హెల్ప్ చేస్తోంది.
 
చిన్న సినిమాలకి ప్రేక్షకులు చాలా సెలెక్టెడ్ గా థియేటర్ కి వస్తున్నారు కదా.. ఆ భయం ఏమైనా ఉందా ?
వుందండీ. అందుకే చాలా కొత్తగా వైవిధ్యంగా ప్రమోట్ చేస్తున్నాం. జనాల్ని మార్నింగ్ షోకి తీసుకురావాలనేది మా టార్గెట్. మంచి టాక్ స్ప్రెడ్ అయితే, సినిమా బావుంటే ఖచ్చితంగా చూస్తారు.
 
మీ మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కి స్క్రీన్ ప్లే లో చాలా మంచి పేరు వచ్చింది. అలాంటి రేసీ స్క్రీన్ ప్లేతో కొత్త సినిమాల ఆలోచనలు ఏమైనా ఉన్నాయా ?
లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ స్క్రీన్ ప్లే కూడా రేసీగా వుంటుంది.  ఒక ట్రాక్ నడుస్తోంది. ఆ ట్రాక్ లోకి లీడ్ రోల్స్ ఎప్పుడు వస్తారా అనే ఎక్సయిమెంట్ వుంటుంది. చాలా కొత్తగా వుంటుంది.
 
మీ కథలు మీ నాన్న చదువుతారా ?
ప్రతి బౌండ్ స్క్రిప్ట్ ని నాన్నకి ఇస్తా. చదివి అభిప్రాయాలు, సూచనలు చెబుతారు. ఆయన కథతో సినిమా చేయాలనే ఆలోచన ఎప్పటి నుండో వుంది. దానిపై ప్రత్యేక దృష్టి పెట్టి చేయాలి.
 
ఈ కథ విన్న తర్వాత వెంకట్ బోయనపల్లి గారు ఎలా స్పందించారు ?
ఆయనకి ఎప్పటి నుండో ఒక సినిమా చేయాలి. లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ కథ, టైటిల్ ఆయనకి చాలా నచ్చాయి. నా మీద నమ్మకంతో ఎక్కడా రాజీపడకుండా సినిమా నిర్మించారు. ఈ సినిమా కోసం మారేడిమిల్లి అడవి లో షూట్ చేశాం. అదొక మంచి అనుభవం.
 
లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ప్రమోషన్స్ లో చిరంజీవి గారు కూడా కలిసోచ్చారు కదా ?
నిజంగా ఇది అనుకోకుండా జరిగింది. వాల్తేరు వీరయ్య టీజర్ లో లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ అనే డైలాగ్ వాడగానే అందరూ మమ్మల్ని ట్యాగ్ చేశారు. చాలా ఆనందంగా అనిపించింది. ఏదో అద్భుతంగా జరగాలని ఎదురుచూశాం. చిరంజీవి గారి రూపంలో మాకు అద్భుతం జరిగింది.
 
ప్రవీణ్ లక్క రాజు మ్యూజిక్ గురించి ?
ప్రవీణ్ లక్క రాజుతో ఎక్ మినీ కథ, ఎక్స్ ప్రెస్ రాజా చేశాను. ఆర్ఆర్ అద్భుతంగా ఇచ్చాడు. డివోపీ వసంత్ కొన్ని తమిళ చిత్రాలు చేశారు. చాలా బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. దావూద్ స్క్రీన్ ప్లే కి హెల్ప్ చేశారు. ఇద్దరం కలసి చేశాం.
 
కొత్తగా చేయబోతున్న సినిమాలు ?
స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. పెద్ద సినిమా చేయాలనే మూడ్ లో వున్నా.  జవాన్ నిర్మాత కృష్ణ గారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, యూవీ క్రియేషన్స్, అలాగే  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ లో  కూడా ఒక సినిమా చేయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments