Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పెళ్లి ఆగిపోతే ప్రేమ్ కుమార్ ఏంచేశాడు!

పెళ్లి ఆగిపోతే ప్రేమ్ కుమార్ ఏంచేశాడు!
, శనివారం, 5 ఫిబ్రవరి 2022 (15:48 IST)
Santosh Shobhan,
సంతోష్ శోభన్ హీరోగా సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. పతాకంపై సరళ పన్నీరు సమర్పణలో శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమ్ కుమార్'. అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రాశీ సింగ్ కథానాయిక. కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, రాజ్ మాదిరాజు, అశోక్ కుమార్, మధు, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య, సాయి శ్వేత, ఆకుల శివ ఇతర తారాగణం. సినిమాలో తొలి పాట 'నీలాంబరం...'ను శనివారం విడుదల చేశారు.
'నీలాంబరం... చూసి నీ కళ్ళలో!
మేఘామృతం... జారే నా గుండెలో!
మాటలని మోయలేని పెదవే...
మౌనంగా నిన్ను సాయమడిగే...
పదే పదే... మనోహరంగా!
తదేకమే యధావిధంగానీ
పైనే ఆశ...'
అంటూ కిట్టు విస్సాప్రగడ సాహిత్యం... ఎస్. అనంత్ శ్రీకర్ సంగీతం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు విడుదల అవుతున్నాయి.
 
"వచ్చేసింది వచ్చేసింది! 'నీలాంబరం...' పాట వచ్చేసింది. ప్రేమ్ కుమార్ గారు తన కలల సుందరి గురించి పాటలు కూడా మొదలెట్టేసాడు" అని చిత్రబృందం తెలియజేసింది.
 
నిర్మాత శివప్రసాద్ పన్నీరు మాట్లాడుతూ "ఈ రోజు విడుదల చేసిన 'నీలాంబరం' పాటకు అద్భుత స్పందన లభిస్తోంది. మంచి మెలోడీ అని శ్రోతలు చెబుతున్నారు. త్వరలో మిగతా పాటలను విడుదల చేయాలని అనుకుంటున్నాం. ఇదొక హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా. మా దర్శకుడు అభిషేక్ మహర్షి, రచయిత అనిరుధ్ కృష్ణమూర్తి కలిసి చక్కటి ఓ సరికొత్త కథ రాశారు. కథనం ఆసక్తి కలిగిస్తూ, నవ్విస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం" అని అన్నారు.
 
దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ "ప్రేమ్ కుమార్ పాత్రలో సంతోష్ శోభన్ కనిపిస్తారు. పీటల మీద పెళ్లి ఆగితే... ప్రేమ్ కుమార్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉంటుంది. ప్రేమ, పెళ్లి, కుటుంబ అనుబంధాలు... సినిమాలో అన్నీ ఉన్నాయి. 'నీలాంబరం...' పాట అందరినీ నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.
 
సంతోష్ శోభన్, రాశీ సింగ్, కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, రాజ్ మాదిరాజు, అశోక్ కుమార్, మధు, అభిషేక్ మహర్షి, శ్రీవిద్య, సాయి శ్వేత, ఆకుల శివ నటిస్తున్న ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్రకుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డిజిటల్ మీడియా: టికెట్ ఫ్యాక్టరీ, ఎడిటర్: గ్యారీ బీహెచ్, సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగాం, రచన: అభిషేక్ మహర్షి, అనిరుధ్ కృష్ణమూర్తి, అడిషనల్ డైలాగ్స్: చరణ్ తేజ్, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: అనంత్ శ్రీకర్, నిర్మాణ సంస్థ:  సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి, నిర్మాత: శివప్రసాద్ పన్నీరు, దర్శకత్వం: అభిషేక్ మహర్షి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వెంటిలేటర్‌పై ప్రముఖ గాయని లతా మంగేష్కర్ -త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి