చిరంజీవి గారికి అనుచరునిగా వున్నప్పుడు మా కారుని కాల్చేశారు : విశ్వక్సేన్

దేవి
సోమవారం, 10 ఫిబ్రవరి 2025 (10:37 IST)
Viswaksen, Chiranjeevi
విశ్వక్సేన్  'లైలా' ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లేటెస్ట్ గా విడుదలైన ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది.
 
ఈ సందర్భంగా విశ్వక్సేన్ మాట్లాడుతూ..  చిరంజీవి గారు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఆయన కళ్ళలో ఒక ఆర్టిస్ట్ ఆనందంగా ఫీలవ్వడం కనిపించింది. అది నాకు ఫస్ట్ అవార్డ్, రివార్డ్. మా నాన్న చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. రాజకీయాల్లో ఆయన అనుచరునిగా వున్నప్పుడు మా కారు ఎవరో కాల్చేశారు. అది న్యూస్ గా వచ్చింది. మేము భయంలో వున్నాం. డాడీ ఫోన్ రింగ్ అయితే నేను లిఫ్ట్ చేశాను. హలో ఎవరు అంటే .నేను చిరంజీవి అనే వాయిస్ వినిపించింది. వెంటనే డాడీకి ఫోన్ ఇచ్చాను. అప్పుడు అనిపించింది మా కారు కాలిపోవడం మంచి పని అయ్యిందని. కారు కాలిపోయిందనే దిగులు మర్చిపోయి చిరంజీవి గారు కాల్ చేశారని సెలబ్రేట్ చేసుకున్నాం. అదొక మెమరబుల్ మూమెంట్. 
 
నా సినిమాకి ఆయన సపోర్ట్ చేయడానికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కథ నా దగ్గరకి తీసుకొచ్చింది సాహు గారు. ఇది నా కెరీర్ లో స్పెషల్ మూవీ. ఈ కథకు న్యాయం చేశానని నమ్ముతున్నాను. రామ్ కథ చెప్పినప్పుడు నవ్వించాడు. నేను జనాల్ని నవ్వించాలని డిసైడ్ అయ్యాను. అనిల్ అన్నకి కంగ్రాట్స్. మెంటల్ హెల్త్ కి మించిన రిచ్ నెస్ మరొకటి లేదు. మెంటల్ పీస్ వున్నవాడు అందరికంటే ధనవంతుడు. ఎవరికీ హాణి చేయకపోడమే మనం చేసే పెద్ద హెల్ప్. సంక్రాంతికి అనిల్ అన్న అందరినీ నవ్వించే సినిమా చేశాడు. అన్నదానం ఎంత గొప్పదో మంచి వినోదం వున్న సినిమా తీయడం కూడా అంత గొప్పది. అదే ప్రయత్నం మేము లైలాతో చేశాం. ఫెబ్రవరి 14న అందరూ థియేటర్స్ కి వచ్చేయండి. సరదాగా ఎంజాయ్ చేయండి. లియోన్ జేమ్స్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్స్. నిర్మాత సాహు గారికి అర్చన గారికి థాంక్ యూ. లవ్ యూ మెగాస్టార్ సర్. లైఫ్ లో గుర్తుండిపోయే రోజు ఇది' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments