Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓషో తులసీరామ్, సాయి ధన్సికల దక్షిణ చిత్రీకరణ పూర్తి

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (12:51 IST)
Sai Dhansika
'కబాలి' ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ 'దక్షిణ'. ఛార్మీ కౌర్ ప్రధాన పాత్రలో విజయవంతమైన మహిళా ప్రాధాన్య చిత్రాలు 'మంత్ర', 'మంగళ' తీసిన ఓషో తులసీరామ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రాన్ని కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తైంది.  
 
చిత్ర నిర్మాత అశోక్ షిండే మాట్లాడుతూ ''ఇదొక సైకో థ్రిల్లర్. సినిమా అంతా భావోద్వేగాలదే ప్రధాన పాత్ర. సాయి ధన్సిక ఐపీఎస్ అధికారి పాత్ర చేశారు. పవర్‌పుల్ రోల్‌లో ఆమె అద్భుతంగా నటించారు. 'దక్షిణ' విడుదల తర్వాత ఆమెకు మరింత పేరు వస్తుంది. హైదరాబాద్, విశాఖపట్టణం, గోవాల్లో చిత్రీకరణ చేశాం. మొత్తం 45 రోజుల్లో సినిమా కంప్లీట్ చేశాం. 'మంత్ర', 'మంగళ' సినిమాల తరహాలో 'దక్షిణ' కూడా ట్రెండ్ సెట్ చేస్తుంది'' అని చెప్పారు.
 
సాయి ధన్సిక, రిషబ్ బసు, సుభాష్, ఆనంద భారతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : నర్సింగ్, సంగీతం : బాలాజీ, నిర్మాణ సంస్థ: కల్ట్ కాన్సెప్ట్స్, నిర్మాత : అశోక్ షిండే, దర్శకత్వం : ఓషో తులసీరామ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments