Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఎవ్రీథింగ్‌"కు అవార్డుల పంట.. ఆస్కార్ వేదికపై సత్తా చాటిన 'నాటు నాటు' సాంగ్

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (12:00 IST)
ఆస్కార్ 2023లో హాలీవుడ్ చిత్రం "ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్" చిత్రం అవార్డులను కొల్లగొట్టింది. ఈ మూవీ ఏకంగా ఏడు ఆస్కార్లను కైవసం చేసుకుంది. అలాగే, తెలుగు చిత్రం "ఆర్ఆర్ఆర్‌"లోని 'నాటు నాటు' పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు వరించింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా సోమవారం ఆస్కార్ అవార్డు వెల్లడి, ప్రదానోత్సవ కార్యక్రమం కన్నులపండుగగా జరిగింది. ఇందులో "ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్" అనే చిత్రం ఏకంగా ఏడు అవార్డులను కైవసం చేసుకుంది. 
 
ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటితో పాటు మరికొన్ని విభాగాల్లో అవార్డులు వరించాయి. మరోవైపు, మన దేశం నుంచి నామినేట్‌ అయిన 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌' సైతం ఆయా విభాగాల్లో అవార్డులు అందుకున్నాయి. ఆస్కార్ 2023 అవార్డులు పొందిన చిత్రాల వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తమ చిత్రం : ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ దర్శకుడు : డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ షైనెర్ట్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ నటుడు : బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌)
ఉత్తమ నటి : మిషెల్‌ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ : నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ సహాయ నటుడు : కి హుయ్‌ క్వాన్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సహాయ నటి : జామీ లీ కర్టిస్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డెజైన్‌ : రూథ్‌ కార్టర్‌ (బ్లాక్‌ పాంథర్‌: వకండా ఫరెవర్‌)
ఉత్తమ స్క్రీన్‌ప్లే : డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : జేమ్స్‌ఫ్రెండ్‌ (ఆల్‌ క్వైట్‌ ఆన్‌ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌)
ఉత్తమ ఎడిటర్‌ : పాల్‌ రోజర్స్‌ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌ (జర్మనీ)
డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ : నవానీ
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ : ఎలిఫెంట్‌ విస్పరర్స్‌
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ : క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ ( ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ : అవతార్ 2 (అవతార్: ది వే ఆఫ్ వాటర్)
బెస్ట్‌ సౌండ్‌ : టాప్‌గన్ : మావెరిక్‌
బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైల్‌ : ది వేల్‌
బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : పినాషియో
లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : ఏన్‌ ఐరిష్‌ గుడ్‌బై
యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : ద బాయ్‌, ద మోల్‌, ద ఫాక్స్‌, అండ్‌ ది హార్స్‌
ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే : షెరా పాల్లే (ఉమెన్‌ టాకింగ్‌)
ఒరిజినల్‌ స్కోర్‌ : బ్రెటెల్‌మాన్‌ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్ఆర్ఆర్ కేసు : విజయపాల్‌కు సుప్రీంకోర్టుకు షాక్...

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. మద్దతు పలికిన అజిత్ పవార్

పుష్ప 2 ఎప్పుడొస్తుందా చూద్దామని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా: అంబటి రాంబాబు (video)

విమానంలో విషపూరిత పాములు... వణికిపోయిన ప్రయాణికులు

స్పేస్ ఎక్స్ విమానంలో భూమికి తిరిగిరానున్న సునీత-విల్మోర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments