Webdunia - Bharat's app for daily news and videos

Install App

రివ్యూ రైట‌ర్స్ పైన ఫైర్ అయిన హీరో శ్రీకాంత్..!

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (11:48 IST)
హీరో శ్రీకాంత్ న‌టించిన తాజా చిత్రం ఆపరేషన్ 2019. ఈ నెల 1న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది కానీ.. ఆశించిన స్ధాయిలో ఆక‌ట్టుకోలేక‌పోయింది. అయిన‌ప్ప‌టికీ చిత్ర యూనిట్ స‌క్స‌స్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ మీట్లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ... ఆపరేషన్ 2019 చిత్రాన్ని ఇంత స‌క్సెస్ చేసినందుకు ముందుగా అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు.
 
ప్ర‌స్తుతం స‌మాజంలో ఉండే ప‌రిస్థితుల‌కి అనుగుణంగా ఉన్న చిత్ర‌మిది. మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. చాలా పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ప‌బ్లిక్ టాక్ చాలా ఇంపార్టెంట్‌. ప్ర‌తి ఒక్కరూ క‌నెక్ట్ అయ్యే చిత్ర‌మిది. ప్రొడ్యూస‌ర్, ఈ చిత్రం కొన్న బ‌య్య‌ర్లు అంద‌రూ సేఫ్.. ఎవ్వ‌రికీ న‌ష్టం రాకూడ‌దు. అంతా బాగానే ఉంది కానీ.. మాకు కొంత అసంతృప్తి అన్న‌ది కొన్ని రివ్యూస్ వ‌ల్ల అనిపించింది. 
 
రివ్యూస్ రాసే వాళ్లు ఎవ‌రి అభిప్రాయం వాళ్ళ‌ది. మేము మీ అభిప్రాయాన్ని గౌర‌విస్తున్నాం కాద‌న‌డంలేదు కానీ... ఒక రివ్యూ ఇచ్చేట‌ప్పుడు కొంచెం ఆలోచించాలి. ముందు థియేటర్స్‌కి వెళ్లి సినిమా చూసి రాస్తే మంచిది అంటూ రివ్యూ రైట‌ర్స్ పైన త‌న‌దైన శైలిలో ఫైర్ అయ్యారు. సొసైటీ ఎదుర్కొంటున్న కరెంట్ సమస్యని ఇందులో చూపించాం. ఇది నాలుగు సినిమాలు, నాలుగు ఫైట్లు సినిమా కాదు. 
 
రివ్యూస్‌ రాయండి తప్పులేదు. సినిమాపై విశ్లేషించండి.. ఎక్కడ బావుంది ఎక్కడ బాలేదు అన్నది చెప్పండి. మీరు ఇచ్చే రేటింగ్‌ల వల్ల అందరూ ఆ రేటింగ్‌నే చూస్తున్నారు తప్ప ఎవరూ మ్యాటర్ చదవడం లేదు. ఇది మీ విజ్ఞ‌తకే వదిలేస్తున్నా అంటూ త‌న ఆవేద‌న వ్య‌క్తం చేసారు. అదీ.. సంగ‌తి..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments