Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుబ్రహ్మణ్య‌పురంలో నా పాత్ర కొత్త‌గా ఉంటుంది... సుమంత్ ఇంటర్వ్యూ

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (10:56 IST)
సెన్సిబుల్ హీరో సుమంత్, ఈషారెబ్బ హీరోహీరోయిన్లుగా, సుధాక‌ర్ ఇంపెక్స్ ఐపియ‌ల్ బ్యాన‌ర్ పైన బీరం సుధాక‌ర్ రెడ్డి నిర్మాణంలో  నూత‌న ద‌ర్శ‌కుడు సంతోష్ జాగ‌ర్లపూడి రూపొందించిన చిత్రం సుబ్రహ్మణ్య‌పురం. ఈ నెల 7న గ్రాండ్ గా ప్రేక్షకులముందుకు రాబోతున్న ఈ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నారు హీరో సుమంత్.
 
సుబ్రహ్మణ్యపురం ఎందుకు చేయాలనుకున్నారు?
కథ వినగానే సినిమా చేయాలనిపించింది. నేను ఎప్పుడూ కమర్షియల్ లెక్కలు వేసుకోను, అదే నా ప్లస్ అండ్ మైనస్. సుబ్రహ్మణ్య‌పురం కథ వినగానే చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. ఈ కథ నాకు కనెక్ట్ అయ్యింది. మళ్ళీ రావా తర్వాత రోమాంటిక్ స్టోరీస్ వస్తాయి అనుకున్నాను, కానీ అన్నీ థ్రిలర్స్ నా దగ్గరకు వచ్చాయి. ఈ స్టోరీ సిట్టింగ్ అప్పుడు నచ్చదు అనే మైండ్ సెట్లోనే విన్నాను. సంతోష్ రెండున్నర గంటల నారేషన్ నన్ను ఎంగేజ్ చేసింది. అందుకే ఎలాంటి మార్పులు చేయకుండా కథ చేసాను.
 
కొత్త దర్శకుడు కదా... అనుమానం రాలేదా?
సంతోష్ నాకు చెప్పినప్పుడు కొత్త దర్శకుడు కథ బాగా చెప్పాడు. అతను ఎలా తీయగలడు అనే సందేహాలుండేవి. కానీ అతను తీసిన షార్ట్ ఫిల్మ్ చూసాక నమ్మకం వచ్చింది. కథలో నా క్యారెక్టర్ అనే కాదు అన్నీ పాత్రలు బాగున్నాయి. 
 
నా క్యారెక్టర్ గురించి చెప్పాలంటే... 
ఇందులో కార్తిక్ హేతువాది, దేవుణ్ణి నమ్మడు కానీ, గుళ్ళ గురించి రీసెర్చ్ చేస్తుంటాడు. ఈ పాత్రతో నా ట్రావెల్ నాకు కొత్త ఎక్స్‌పీరియన్స్‌లను అందించింది. ఈ పాత్ర కోసం నేనేమీ పెద్దగా కష్టపడలేదు కానీ  పాత్రలో కొత్తగా కనిపిస్తాను. నేను హీరో బిల్డప్ సీన్స్, ఎలివేషన్స్ మీద పెద్ద నమ్మకం ఉండదు. కానీ మహేష్, తారక్ సినిమాలకు వెళ్ళి విజిల్స్ వేస్తాను.
 
ఈషారెబ్బ పాత్ర ఎలా వుంటుంది?
ఆమె నాతో గొడవలు పడుతుంది. నేను ఈ సినిమాలో హేతువాదిని, హీరోయిన్ సాంప్రదాయాలను గౌరవించే అమ్మాయి. వీరి మద్య కొన్ని వైరుధ్యాలుంటాయి. కానీ ఈరెండు పాత్రల మద్య ట్రావెల్ బాగుంటుంది. 
 
స్క్రిప్ట్ పరంగానే నడుచుకున్నాను. ఇది క్యారెక్టర్‌తో నడిచే సినిమా అయినా, మేము బలవంతగా ఇరికించలేదు. కథనంతో పాటు నిజాయితిగా అన్ని పాత్రలు నడుచుకుంటాయి. 
 
రానా వాయిస్ ఓవర్ ఎందుకు తీసుకున్నారు?
రానా అవసరం అనిపించింది. ఇందులో కొన్ని సన్నివేశాలకు బాగా తెలుగు పలకగలిగిన గొంతు అవసరం అయ్యింది. నాకు రానా మొదట ఆలోచనలోకి వచ్చాడు. రానా స్ర్కిప్ట్ విని వెంటనే ఒప్పుకున్నాడు. ఆ వాయిస్ కథనంకు బలంగా మారింది.
 
నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి గారి సపోర్ట్ చాలా ఉంది. ఆయన పైనాన్షియర్‌గా చాలా మంచి సినిమాలకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ కథను నిర్మించాలంటే గట్స్ ఉన్న నిర్మాతలు కావాలి అనిపించింది. ఇప్పుడు ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. నాగా చైతన్య కూడా కలిసినప్పుడు అన్నాడు ‘ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారని’, చాలా సంతోషంగా ఉంది. అలాంటి ప్రొడ్యూస‌ర్ దొరికినందుకు.
 
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో ఏఎన్నార్‌గా కనిపిస్తున్నారు...
తాత‌ పాత్ర చేయ‌డం నా అదృష్టం. క్రిష్ నాకు చాలా కాలంగా తెలుసు, తాత పాత్ర అన‌గానే ఒక బాధ్యత‌గా తీసుకున్నాను. నేనేం పెద్ద‌గా ఇమిటేట్ చేయ‌లేదు, తాత ఇంట‌ర్య్వూలు చాలా చూసాను. ఇమిటేష‌న్‌కి యాక్టింగ్‌కి మ‌ధ్యలో చేయ‌డానికి ప్ర‌య‌త్నించాను. బాల‌కృష్ణ‌గారితో పనిచేయ‌డం చాలా గొప్ప‌గా అనిపించింది. ఈ సినిమా గురించి ఆయ‌న చెప్పిన మాట‌లు ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయి. 

సుబ్రహ్మణ్యపురంలో గ్రాఫిక్స్....
ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కి స్కోప్ ఉంది. కానీ క‌థ ప‌రంగా ఎంత అవ‌స‌ర‌మో అంతే చేసాం. ఈ సినిమా విజువ‌ల్ ఎఫెక్ట్స్ మొత్తం అన్న‌పూర్ణ టీం  చేసింది. మీరు త‌ప్ప‌కుండా స‌ర్‌ప్రైజ్ అవుతారు. 
 
చెప్పిన దాంటో 90 శాతం చేసాడు ద‌ర్శ‌కుడు. ఈ క‌థ విన‌గానే చెప్పిన‌దాంట్లో 70 శాతం చేయ‌గ‌లిగితే స‌క్సెస్ అవుతాము అనుకున్నాం. కానీ ఫ‌స్ట్ కాపీ చూసాక ద‌ర్శ‌కుడు సంతోష్ 90 శాతం చేసాడు అనిపించింది. చాలా క్లారిటీ ఉన్న ద‌ర్శ‌కుడు. 
 
ద‌ర్శ‌కుడు త‌ర్వాత గుర్తుకు వ‌చ్చేది శేఖ‌ర్ చంద్రే. శేఖ‌ర్ చంద్ర ఈ సినిమాకు బ్యాక్ బోన్ అనుకోవ‌చ్చు. శేఖ‌ర్‌ని నేనే ప్ర‌పోజ్ చేసాను. చాలా అద్బుతంగా మ్యూజిక్ అందించాడు. ఇందులో మూడు పాట‌లు చాలా బాగుంటాయి. అత‌ని వ‌ర్క్ గురించి అంద‌రూ మాట్లాడుకుంటారు అని చెప్పారు సుమంత్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments