Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐ యామ్ ప్యూర్ వర్జిన్... లైంగిక కోర్కెల కోసం పెళ్లి చేసుకోవడం లేదు : రాఖీ సావంత్

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (09:08 IST)
ఈనెల 31వ తేదీన బాలీవుడ్ నటుడు దీపక్ కలాల్‌ను బాలీవుడ్ సెక్సీ క్వీన్ రాఖీ సావంత్ పెళ్లి చేసుకోనుంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతోంది. పెళ్లి దుస్తులు, నగల షాపింగ్‌లో కూడా రాఖీ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే, తాను ఎందుకు దీపక్‌ను పెళ్లి చేసుకుంటుందో ఆమె తాజాగా వివరించింది. లైంగిక అవసరాలు తీర్చుకునేందుకు పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. పెళ్లి కోసం ఎగ్జయిటెడ్‌గా ఉన్నట్టు చెప్పారు.
 
'నాకు పెళ్లి చీర కట్టుకోవాలని, పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేయాలని ఉంటుంది కదా! నేను లైంగిక కోర్కెలు తీర్చుకోడం కోసం పెళ్లి చేసుకోవడం లేదు. ఈ రోజుల్లో సెక్స్‌ కోసం ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు? ముంబైలోని జస్‌లాక్‌ హాస్పిటల్‌లో నాకు వర్జినిటీ టెస్ట్‌ కూడా దీపక్ చేయించాడు. ఇందులో నేను 'కన్య' అని తేలింది. ఐ యామ్ ప్యూర్' అని రాఖీ సావంత్ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. 
 
ఇకపోతే దీపక్ గురించి స్పందిస్తూ, అతన్ని అమెరికాలో కలిసినట్టు చెప్పింది. కొన్ని క్షణాలకు అతను నాకు ప్రపోజ్‌ చేశాడు. తర్వాత 'ఇండియాస్‌ గాట్‌ టాలెంట్' కార్యక్రమంలో కరణ్‌ జోహార్‌ ముందు మరోసారి ప్రపోజ్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లో దీపక్‌ కలాల్‌ ప్రపోజల్‌ గురించి పోస్ట్‌ చేయగా... ఫాలోయర్లు అతణ్ణి పెళ్లి చేసుకోమని చెప్పారు. అభిమానులే నా దేవుళ్లు. వారు చెప్పినట్టుగానే పళ్లి చేసుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించారో అంతే సంగతులు.. పురుషులను టార్గెట్ చేసిన తాలిబన్

తెలంగాణ, రామగుండంలో భూకంపం సంభవిస్తుందా?

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం