Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో?

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పలువురు హీరోలు వెండితెరపై సందడి చేస్తున్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి కాకుండా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రాంచరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు హీరోగా ఉం

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2017 (10:25 IST)
మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే పలువురు హీరోలు వెండితెరపై సందడి చేస్తున్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి కాకుండా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రాంచరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌లు హీరోగా ఉండగా, నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. నాగబాబు కుమార్తె నీహారిక హీరోయిన్‌గా నటిస్తోంది.
 
ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెర అరంగేంట్రం చేయనున్నారు. హీరోగా పరిచయం కానున్న వ్యక్తి ఎవరో కాదు. చిరంజీవి కుమార్తె భర్త కళ్యాణ్. కొంతకాలం క్రితమే నటన వైపుకు రావాలని ఉందంటూ చిరంజీవికి తన మనసులో మాట చెప్పిన కల్యాణ్, ఆయన సూచన మేరకు మార్షల్ ఆర్ట్స్‌లోను .. డాన్స్‌లోను శిక్షణ తీసుకున్నాడట. 
 
ఈలోగానే చిరూ.. చరణ్‌లు కల్యాణ్ కానుగంటి కోసం కథలు వినడం చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో 'జత కలిసే' చిత్ర దర్శకుడు రాకేశ్ శశితో కథా చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. ఈ కథ విషయంలో రాకేశ్ శశి.. చిరంజీవిని ఒప్పించగలిగితే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాకి సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించనున్నారట. త్వరలోనే ఈ విషయంలో మరింత స్పష్టత రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments