Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

డీవీ
బుధవారం, 27 నవంబరు 2024 (19:24 IST)
Venkatesh and Aishwarya Rajesh
విక్టరీ వెంకటేష్  ఎక్స్-కాప్ గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్ టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది.
 
ఈ రోజు, మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ గోదారి గట్టుకు సంబంధించిన అప్‌డేట్‌తో వచ్చారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. రమణ గోగుల పాడిన ఈ పాట ఆయన కమ్ బ్యాక్ ని సూచిస్తుంది. ఈ బ్రీజీ రొమాంటిక్ మెలోడీకి భాస్కరభట్ల రిరిక్స్ రాశారు.
 
సాంగ్ పోస్టర్ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ మధ్య ఒక బ్యూటీఫుల్ మూమెంట్, వెన్నెల రాత్రి నేపథ్యంలో సెట్ చేయబడింది. పౌర్ణమి ఆకాశంలో అందంగా వుంది, అద్భుతమైన సెట్టింగ్స్ మధ్య రొమాంటిక్ మూమెంట్స్ ని ఆస్వాదిస్తున్న జంట ఆకట్టుకుంది.
 
హీరో వెంకటేష్‌, మరో హీరోయిన్ మీనాక్షి చౌదరితో కలసి ప్రస్తుతం డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని అద్భుతమైన ప్రదేశాలలో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.
 
సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
 
తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి
సాంకేతిక సిబ్బంది:

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments