Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాధే శ్యామ్.. పూజాతో పాటు కునాల్‌కు బర్త్ డే.. ప్రేరణ ఫస్ట్ లుక్ విడుదల

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (15:23 IST)
Radhe Shyam
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రముఖ కథానాయిక పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్‌స్టోరీ ''రాధేశ్యామ్''. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
పూజ జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు (అక్టోబర్ 13) ఆమె ఫస్ట్‌లుక్ విడుదలైంది. అంతేగాకుండా.. పూజా హెగ్డేతో పాటు 'రాధేశ్యామ్' టీమ్‌లోని కునాల్ రాయ్ కపూర్ కూడా బర్త్‌డే జరుపుకుంటున్నాడు. అతనికి విష్ చేస్తూ పూజ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ ఫొటోను షేర్ చేసింది.
 
ఈ ఫొటోలో పూజ, కునాల్‌తోపాటు ప్రభాస్ కూడా ఉన్నాడు. ఇటలీ వీధుల్లో ముగ్గురూ మాస్క్ ధరించి ఫొటోకు ఫోజులిచ్చారు. వచ్చే రెండు నెలల్లో మిగిలిన షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక తాజాగా విడుదలైన పూజా హెగ్డే లుక్‌లో ఆమె ఆకుపచ్చ దుస్తులలో అందంగా కనిపిస్తుంది. 
 
ఆమె రైలులో జర్నీ చేసేటప్పుడు ఈ ఫోటో తీసినట్లుంది. పొడవైన జాకెట్, తలను కండువాతో కవర్ చేసింది. రాధే శ్యామ్‌లో పూజా పాత్ర పేరు ప్రేరణ. తెలుగు చిత్రనిర్మాత రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించి యువి క్రియేషన్స్ నిర్మించిన రాధే శ్యామ్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

ఈ చిత్రం నుండి పూజా హెగ్డే ఫస్ట్ లుక్‌ను పంచుకుంటూ, ఆమె సహనటుడు.. సినీ హీరో ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు: "మా ప్రేరణకు పుట్టినరోజు శుభాకాంక్షలు!" అంటూ విషెస్ చెప్పారు. ఈ ఫస్ట్ లుక్ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments