Webdunia - Bharat's app for daily news and videos

Install App

#OkkaKshanam టీజర్ : లవ్ వర్సెస్ డెస్టినీ

'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్న దర్శకుడు వీఐ ఆనంద్. ఈయన రెండో చిత్రం ఒక్క క్షణం.

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (14:23 IST)
'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్న దర్శకుడు వీఐ ఆనంద్. ఈయన రెండో చిత్రం ఒక్క క్షణం. ప్రపంచంలో ఓ ఇద్దరు వ్యక్తుల జీవితాలు సమాంతరంగా ఉండే అవకాశం ఉందని, అందులో ఒకరి గతం మరొకరి భవిష్యత్తు కావచ్చనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
 
ఈ సినిమాలో అల్లు శిరీష్ హీరోగాను, సురభి, సీరత్ కపూర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నాడు. ప్రేమించిన అమ్మాయి కోసం చావడానికికైనా సిద్ధపడే కుర్రాడి పాత్రలో శిరీష్ కనిపించనున్నాడు. ఈనెలాఖరులోగా విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ఆదివారం విడుదలైంది. సినిమా టీజర్‌ను అల్లు శిరీష్ తన ట్విట్టర్ ఖాతాలో ఉంచాడు.
 
టీజర్‌తో సినిమాపై అంచనాలను దర్శకుడు పెంచేశాడు. టీజర్ చాలా ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. లవ్ వర్సస్ డెస్టినీ.. ఇదే సినిమాలో ప్రధాన అంశం. సినిమా సబ్ టైటిల్ కూడా ఇదే. అగ్గిపుల్లలను ఆధారంగా చేసుకుని మననుషుల జీవితాలు ఎలా ముడిపడి ఉంటాయో టీజర్‌లో చూపించారు. 
 
కొన్ని అగ్గిపుల్లను రాండమ్‌గా విసిరారు. అందులో ఒక్కో అగ్గిపుల్ల ఒక్కో దిశలో పడగా.. రెండు మాత్రం సమాంతరంగా పడ్డాయి. ‘కేవలం గుప్పెడు పుల్లల్లో రెండు సమాంతంగా పడినప్పుడు.. ఇన్ని వందల కోట్ల జనాల్లో ఎంతమంది జీవితాలు సమాంతరంగా ఉండొచ్చు’ అంటూ నటుడు జయప్రకాశ్ చెప్పే డైలాగ్ చాలా ఆసక్తికరంగా ఉంది. మొత్తానికి ఒక స్ట్రాంగ్ కాన్సెప్ట్‌తో అల్లువారి చిన్నబ్బాయి రెడీ అవుతున్నాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రైవేట్ టీచర్ వధువు - ప్రభుత్వ టీచర్ వరుడు.. మధ్యలో దూరిన మరో గవర్నమెంట్ టీచర్.. ఆగిన పెళ్లి!

గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదంలో 16కు పెరిగిన మృతుల సంఖ్య

పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!

పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగంలో సాంకేతిక సమస్య!!

పాకిస్థాన్‌తో పోరుపై భారత ఆర్మీ కీలక ప్రకటన ... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments