Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అన్నయ్య' బార్‌లో చికెన్ వింగ్స్ రెడీ చేసిన 'తమ్ముడు'

'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న' నానుడిని ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా, సినీ సెలెబ్రిటీలు అయితే, తమ ఛరిష్మా ఉన్నపుడే నాలుగు పైసలు వెనకేసుకోవడం లేదా ఏదో వ్యాపారాన్ని ప్రారంభించే పనుల్

Advertiesment
'అన్నయ్య' బార్‌లో చికెన్ వింగ్స్ రెడీ చేసిన 'తమ్ముడు'
, మంగళవారం, 28 నవంబరు 2017 (10:24 IST)
'దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న' నానుడిని ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా, సినీ సెలెబ్రిటీలు అయితే, తమ ఛరిష్మా ఉన్నపుడే నాలుగు పైసలు వెనకేసుకోవడం లేదా ఏదో వ్యాపారాన్ని ప్రారంభించే పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ కోవలో హీరోయిన్లు ముందు వరుసలో ఉన్నారనే చెప్పొచ్చు. అలాగే, అల్లు వారబ్బాయి అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఈయన హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో బి-డబ్స్ పేరుతో ఓ పబ్‌ను ప్రారంభించారు. ఇందులో వ్యాపారం ఇపుడు మూడు పువ్వులు ఆరు కాయ‌లుగా సాగుతోంది.
 
అయితే రీసెంట్‌గా బన్నీ సోదరుడు అల్లు శిరీష్ ఈ పబ్‌ను సందర్శించాడు. అన్న‌య్య బార్‌కు వచ్చిన అల్లు శిరీష్ నేరుగా కిచెన్‌లోకి వెళ్ళాడు. అక్క‌డ త‌న‌కి వంట‌లో ఎంత ప్రావీణ్యం ఉందో చూపించాడు. చికెన్ వింగ్స్ రెడీ చేసి ఆ ఫోటోల‌ని త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కి షేర్ చేశాడు. ఫుడ్ ల‌వ‌ర్స్ ఈ బార్‌ని త‌ప్ప‌క విజిట్ చేయాలని కూడా కోరాడు. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అందంతో పనిలేదు.. అమీర్‌తో నటించాలనుంది: మానుషీ చిల్లర్