Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

డీవీ
మంగళవారం, 21 మే 2024 (15:11 IST)
OC movie
హరీష్ బొంపెల్లి, మాన్య సలాడి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఓసి. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సినిమాలోకి రావాలని కొంతమంది యువకుల కథే ఓసి. శరవేగంగా నిర్మాణాంతరపు పనులను పూర్తి చేసుకుంటున్న ఓసి.. జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కౌండిన్య ప్రొడక్షన్స్ పై బీవీస్ నిర్మాతగా, విష్ణు బొంపెల్లి దర్శకత్వంలో రూపొందింది.
 
ఇప్పటికే విడుదలైన ఓసి టీజర్ విశేష ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిత్ర పరిశ్రమలో స్టార్ల కొడుకులే హీరోలవుతారు అనే డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేసేలా చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని కుర్రాళ్ళు సినిమాలో రాణించారా లేదా అనేది తెలియాలంటే జూన్ 7 వరకు వేచి చూడాల్సిందే.
 
మంచి నిర్మాణ విలువలతో, భారీ బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఓసి చిత్రాన్ని తెరకెక్కించినట్టు మేకర్స్ తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథాకథను ఉంటుందని.. థియేటర్లో చూసే వీక్షకులను ఓసి కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రానికి లక్ష్మీకిరణ్ కథ, సాయిరాం తుమ్మలపల్లి సినిమాటోగ్రఫీ అందించగా డాన్స్ మాస్టర్ సత్య కొరియోగ్రఫీ అందించగా, వంశీ ఎస్. అక్షర్ బ్యాండ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇంతకీ ఓసి అంటే ఏంటో చూడాలంటే జూన్ 7 వరకు వేచి ఉండాల్సిందే.
నటీనటులు: హరీష్ బొంపెల్లి, మాన్య సలాడి, రోయల్ శ్రీ, లక్ష్మీ కిరణ్ తదితరులు.
దర్శకత్వం: విష్ణు బొంపెల్లి, నిర్మాత: బీవీఎస్, సినిమాటోగ్రఫీ: సాయిరాం తుమ్మలపల్లి, సంగీత దర్శకుడు: భోలే శివాలి, పీఆర్ఓ: హరీష్, దినేష్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments