Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విన్స్‌కు జన్మనివ్వనున్న 'నువ్వు నేను' హీరోయిన్

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (16:45 IST)
టాలీవుడ్ యువ హీరో ఉదయ్ కిరణ్ నటించిన చిత్రం "నువ్వు నేను". ఈ చిత్రంలో హీరో సరసన అనిత అనే యువతి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం తర్వాత ఆమెకు సరైన ఆఫర్లు లేకపోవడంతో టాలీవుడ్‌కు ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ కూడా ఆఫర్లు వెక్కిరించడంతో రియాలిటీ షోలు, సీరియల్స్‌లలో నటించింది. ఈ క్రమంలో నటుడు రోహిత్ శెట్టితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకుంది. 
 
తాజాగా, త‌న‌ భ‌ర్త‌తో ఉన్న జిఫ్ ఎమోజీని షేర్ చేస్తూ.. 'నా ప్రేమికుడా, నీ మీద ప్రేమ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. జీవితంలో ఆనందంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను. 6 ప్యాక్ యాబ్స్‌, ఇద్ద‌రు క్యూ క్యూట్ బేబీస్ త్వ‌ర‌లోనే రానున్నారు' అని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపింది. అనిత పోస్ట్‌ని బ‌ట్టి త్వ‌ర‌లో ఆమె ఇద్ద‌రు క‌వ‌ల‌ల‌కి జ‌న్మ‌నివ్వ‌బోతుందని అర్థమ‌వుతుంది. 
 
ప్ర‌స్తుతం ప‌లు సీరియ‌ల్స్‌తో బిజీగా ఉన్న అనిత చివ‌రిగా తెలుగులో 'మ‌న‌లో ఒక‌డు' అనే చిత్రం చేసింది. ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టించి, సంగీతం అందించ‌డంతో పాటు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం మ‌న‌లో ఒక‌డు. హిందీ సీరియల్ 'నాగిని-3' చేస్తున్న అనిత అందులో త‌న న‌ట‌నకి ప్ర‌శంస‌లు అందుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments