Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ 31 చిత్రం పోస్ట‌ర్ విడుద‌ల‌

Webdunia
శుక్రవారం, 20 మే 2022 (14:25 IST)
NTR31
సినీ ప్రియుల నుండి సినీ విమర్శకుల వరకు, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆర్‌.ఆర్‌.ఆర్‌., కెజిఎఫ్‌. ఫ్రాంచైజీపై ప్రశంసలు, ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. ఈ రెండు చిత్రాలూ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టినందున, ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రేక్షకులు ఇప్పుడు ఎన్టీఆర్ 31పై  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
ఎన్టీఆర్ మాస్ మనిషి అయితే, ప్రశాంత్ నీల్ మాస్ ద‌ర్శ‌కుడు. ఈ డైనమిక్ ద్వయం NTR31ని అత్యంత క్రేజీ పాన్-ఇండియా చిత్రాలలో ఒకటిగా చేసింది.
 
ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా  ప్రశాంత్ నీల్ పంచుకున్నారు, "ఇది 20 సంవత్సరాల క్రితం నా తలలో ఉద్భవించిన ఆలోచన, కానీ సినిమా పరిమాణం మరియు స్థాయి నన్ను వెనక్కి నెట్టివేసింది. చివరగా నా కలతో నా డ్రీమ్ హీరోతో ప్రాజెక్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది. అని ట్వీట్ చేశాడు.
ఈ సంద‌ర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుద‌ల చేశారు. అందులో పెద్ద మీసాలు మరియు తీక్షణమైన కళ్లతో జూనియర్ ఎన్టీఆర్‌ ఉన్నారు. ఇంటెన్స్ లుక్ తో పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. 
మైత్రీ మూవీ మేకర్స్ & ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించ‌నున్న ఈ చిత్రానికి  ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించ‌నున్న ఈ చిత్రం  ఏప్రిల్ 2023లో సెట్స్ పైకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'నువ్వు చాలా అందంగా ఉంటావు.. నిన్ను ఎవరైనా ప్రేమిస్తే నేనేం చేయాలి' : యువతి సూసైడ్

జగన్ బాటలో కేటీఆర్.. తెలంగాణలో మేం అధికారంలోకి వస్తే..?

వివేకా కుమార్తె సునీత భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల

రాంగోపాల్ వర్మపై తొందరపాటు చర్యలు వద్దు : ఏపీ హైకోర్టు

భూలోక స్వర్గాన్ని తలపించే తిరుమల కొండలు.. హిమపాతంతో అద్భుతం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments