Webdunia - Bharat's app for daily news and videos

Install App

తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్.. ఓపికతో సెల్ఫీ తీసుకుని..?

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (19:45 IST)
హైదారాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి చేశారు. ఓ భూమి కొనుగోలు వ్యవహారంలో ఎన్టీఆర్ అక్కడ లోకల్‌లో ఉన్న తహశీల్దార్ ఆఫీసుకు రావడంతో అక్కడ సందడి నెలకొంది. శంకర్ పల్లిలోని గోపాలపురం రెవెన్యూ పరిధిలో ఆరున్నర ఎకరాల భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం ఎన్టీఆర్ అక్కడకు వచ్చారు. 
 
తహశీల్దార్ ఆఫీసుకు ఎన్టీఆర్ రావడంతో అక్కడ సిబ్బందితో పాటు అక్కడ రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వాళ్లు తారక్‌తో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఎన్టీఆర్ ఎంతో ఓపికగా అందరితో సెల్ఫీ తీసుకునేవరకు అక్కడే ఉన్నారు. ఇక ఎన్టీఆర్‌తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 
 
దీంతో ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ఈయన ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తైయింది. రెండు పాటలను ఉక్రెయిన్‌లో పిక్చరైజ్ చేయనున్నారు.
 
త్వరలోనే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి అక్కడికి వెళ్లనున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో పాటు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 30వ సినిమా చేయనున్నారు. దాంతో పాటు జెమినీ టీవీలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే రియాలిటీ షోలో పాల్గొననున్నారు. త్వరలోనే ఈ షో టీవీలో ప్రసారం కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

ఏపీ సీఎం చంద్రబాబే నాకు స్ఫూర్తి.. రాయలసీమ సంపన్న ప్రాంతంగా మారాలి: పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments