సుమంత్ క‌థ మ‌ళ్లీ మొద‌లైంది

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (18:43 IST)
Sumanth-naina
గ‌త కొన్నిరోజులుగా సుమంత్ మ‌ళ్లీ పెళ్లిచేసుకోబోతున్నారు అంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంది. దీనిపై హీరో సుమంత్ స్పందిస్తూ `తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని, ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా డైవ‌ర్స్ మ‌రియు రీ మ్యారేజ్ కి సంభందించిన అంశాల‌తో కూడుకున్న‌ద‌ని, తెలుగులో ఇలాంటి క‌థతో మొద‌టిసారి ఓ సినిమా వ‌స్తుందని అందులో నుండే ఒక వెడ్డింగ్‌కార్డ్ లీకైంద‌ని` వివ‌ర‌ణ ఇచ్చిన విష‌యం తెలిసిందే.
 
సుమంత్ హీరోగా న‌టిస్తున్న ఆ చిత్రానికి `మ‌ళ్ళీ మొద‌లైంది` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. విడాకులు, మళ్లీ పెళ్లి చేసుకోవడం నేపథ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. నైనా గంగూలి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీని రెడ్ సినిమాస్ ప‌తాకంపై కె. రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది.
 
ఫస్ట్ లుక్ పోస్టర్ లో మొద‌టిఫోటోలో సుమంత్ - నైనా ఒకరినొక‌రు హత్తుకొని బెడ్ మీద పడుకొని ఉండ‌డం  అలాగే రెండో ఫోటోలో వారిద్ద‌రి మ‌ధ్య దూరం మరింత పెరిగినట్లు చూపించారు. విడాకుల తర్వాత జీవితాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారనేది ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
 
సుహాసిని మ‌ణిర‌త్నం, వెన్నెల కిషోర్‌, మంజుల ఘ‌ట్ట‌మ‌నేని, పోసాని కృష్ణ ముర‌ళి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీత ద‌ర్శ‌కుడు. జీఆర్ఎన్ సినిమాటోగ్రాఫ‌ర్.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments