Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్..!

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (22:58 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి అరవింద సమేత.. వీర రాఘవ అనే సినిమా తీయడం.. ఆ సినిమా సక్సస్ సాధించడం తెలిసిందే. ఈ సినిమా సక్సస్ సాధించడంతో వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. ఈ సమ్మర్ లోనే వీరిద్దరూ కలిసి సినిమా స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. కరోనా కారణంగా షూటింగ్స్ ఆగిపోవడంతో ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు.
 
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. రామ్ చరణ్‌‌తో కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ మూవీకి అయిననూ పోయిరావలే.. హస్తినకు అనే టైటిల్ అనుకుంటున్నారని ప్రచారంలోకి వచ్చింది.
 
ఆ తర్వాత ఇందులో ఎన్టీఆర్ పొలిటికల్ లీడర్ గా నటిస్తున్నాడు అంటూ మరో వార్త బయటకు వచ్చింది. తాజా వార్త ఏంటంటే... ఇందులో ఎన్టీఆర్ విదేశాల్లో ఉండే పాత్ర పోషిస్తున్నాడని తెలిసింది. అయితే... పుట్టి పెరిగాక ఇండియాకి ఎపుడూ రాని ఎన్టీఆర్.., మొదటిసారి ఇండియాకి రావాల్సి వస్తోందట.
 
అంతే కాకుండా... సినిమాలో భిన్నమైన రాజకీయ నేపథ్యం కూడా ఉంటుందట. ఇలా... ఈ సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నట్లు తెలిసింది. ఈ మూవీకి సంబంధించి ఇలా వార్తలు బయటకు వస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై రోజురోజుకు మరింత ఆసక్తి ఏర్పడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొడాలి నాని జంప్ జిలానీనా? లుకౌట్ నోటీసు జారీ!!

Visakhapatnam Covid Case: విశాఖపట్నంలో కొత్త కరోనా వైరస్ కేసు- మహిళకు కరోనా పాజిటివ్

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments