Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్‌టిఆర్‌ కొత్త సినిమా కోసం క‌స‌ర‌త్తు!

Webdunia
మంగళవారం, 2 మార్చి 2021 (19:57 IST)
Tarak, Trivikram
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌ నటించే సినిమా మరో మూడు నెల‌ల్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే20న తారక్‌ పుట్టిన రోజే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంటుందని సంకేతాలు అందుతున్నాయి. ప్రి ప్రొడక్షన్‌ వర్క్‌ పనులు సాగిస్తూనే, కాస్ట్‌ అండ్‌ క్రూ ఎంపికపై దృష్టిసారించాడట దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు కథానాయిక, సంగీత దర్శకుడు ఖరారయ్యారు. అలాగే సినిమా విడుదల‌ విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చేశారు.
 
తారక్‌, త్రివిక్రమ్‌ సినిమాకు రష్మిక మందన్నా కథానాయికగా తమన్‌ సంగీత దర్శకుడిగా ఓకే అయినట్లు తెలుస్తోంది. వరుసగా త్రివిక్రమ్‌ మూడో సినిమాకు తమన్‌ సంగీతం అందించనున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 2022 వేసవిలో విడుదల‌ చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ముందు 2022 సంక్రాంతినే టార్గెట్‌ చేశారు కానీ అప్పటికి సినిమాను రెడీ చేయడం కష్టం. పైగా ఆ సీజన్‌కు ఆల్రెడీ మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు ఖరారయ్యాయి. కాబట్టి వేసవికి ఈ చిత్రాన్నిషెడ్యూల్‌ చేయనున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

తిరుపతిలో అద్భుతం, శివుని విగ్రహం కళ్లు తెరిచింది (video)

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments