'దేవర'ను చూస్తూ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ఎన్టీఆర్ అభిమాని

ఐవీఆర్
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (12:14 IST)
తెలుగు రాష్ట్రాల్లో దేవర జాతర జరుగుతోంది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే దేవర చిత్రం చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందిన విషాదకర ఘటన కడపలో చోటుచేసుకున్నది. వివరాలను చూస్తే... కడపలో అప్సర థియేటర్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల కోసం స్పెషల్ షో వేశారు. ఈ మూవీని చూస్తూ మస్తాన్ వలి అనే అభిమాని కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన తోటివారు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడు కడపలోని సీకేదీన్నె మండలం జమాల్ పల్లికి చెందినవాడుగా గుర్తించారు.
 
మరోవైపు చిత్రం హిట్ టాక్ రావడంతో థియేటర్ల వద్ద ప్రేక్షకుల రద్దీ విపరీతంగా వుంటోంది. వీరిని అదుపు చేసేందుకు పలుచోట్ల పోలీసులు కష్టపడాల్సి వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీవారి ప్రసాదంపై యాంకర్ శివజ్యోతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments