Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబ‌ర్ 27న ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ దేవర గ్రాండ్ రిలీజ్

డీవీ
గురువారం, 13 జూన్ 2024 (17:19 IST)
Devara new
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో ఈ మూవీ అత్య‌ద్భుతంగా, శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు.
 
Devara new still
గురువారం చిత్ర యూనిట్ ‘దేవర’ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసింది. ప్రేక్ష‌కుల‌కు ఈ హై యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌టానికి దీన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. అందులో తొలి భాగం ‘దేవర:  పార్ట్ 1’, సెప్టెంబ‌ర్ 27న తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లకానుంది. ఎంటైర్ ఇండియాలోని సినీ ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకునేలా ఈ పాన్ ఇండియా భారీ చిత్రాన్ని విడుద‌ల చేయ‌టానికి ఇదే క‌రెక్ట్ డేట్ అని మేక‌ర్స్ భావిస్తున్నారు.
 
తాజా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్‌తో ‘దేవర’ చిత్రంపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ఎన్టీఆర్ ప‌వ‌ర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజ‌న్స్‌, కొర‌టాల శివ టేకింగ్‌ను ఎప్పుడెప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై చూద్దామా అని అభిమానులు,ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.
 
‘దేవర’గా టైటిల్ పాత్ర‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న ఈ చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై  మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్‌, ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, సాబు శిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments