Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హరిక్రిష్ణ మనవడు తారకరామారావు జూ.ఎన్.టి.ఆర్.కు పోటీ అవుతాడా?

NTR-Vvs chowdary

డీవీ

, గురువారం, 13 జూన్ 2024 (16:28 IST)
NTR-Vvs chowdary
దివంగత నందమూరి తారకరామారావు వారసులు వెండితెరపై బాలక్రిష్ణ తర్వాత పలువురు వచ్చారు. కానీ ఎవరూ అంతగా పేరు తెచ్చుకోలేకపోయారు. ఒక్క జూ. ఎన్.టి.ఆర్. మాత్రమే నిలబడ్డాడు. ఇక ఆయన్ను తమ వారసుడిగా ఒప్పుకున్నారా? లేదా? అనేది పక్కన పెడితే తాజాగా నందమూరి వంశం నుంచి ఎన్.టి.ఆర్. మునిమనవుడు, హరిక్రిష్ణ మనవడు, జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావు ను హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఆ భాధ్యతను ఆ ఫ్యామిలీకి కావాల్సిన  వాడు దర్శకుడు వై.వి.ఎస్. చౌదరిపై వేశారు.
 
గతంలో జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావు  పిల్లలతో తెరకెక్కిన ‘దానవీర శూర కర్ణ’లో కృష్ణుడి పాత్రలో నటించాడు. ఇప్పుడు హీరోగా చేయడానికి వైవిఎస్. చౌదరి ముందుకురావడమేకాదు. నందమూరి వంశీయులు ఆశీస్సులు తీసుకున్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ వుంది. ప్రస్తుతం జూ. ఎన్.టి.ఆర్. పేరు జానకీరామ్ కుమారుడి పేరు ఒక్కటే. రేపు సినిమా హీరో అయితే ఎలా పిలవాలి? జూ.ఎన్.టి.ఆర్.ను ఏ మని పిలవాలి? అని మీడియా వైవిెఎస్. చౌదరిని అడిగితే.. అధి ప్రజలు నిర్ణయిస్తారు. అసలు వారసుడు జానకీరామ్ కుమారుడే అంటూ ఇన్డైరెక్ట్ గా తన మాటను వెలిబుచ్చారు.
 
ఈ జానకీరామ్ కొడుకు తారక రామారావు అచ్చు గుద్దినట్లు పెద్ద ఎన్.టి.ఆర్. యంగ్ లో ఎలా వుండేవాడే. అలా వున్నాడంటూ దర్శకుడు చెప్పాడు. త్వరలో మరలా ఈ వివరాలు తెలియజెప్పేందుకు కలుస్తామంటూ దాటవేశాడు. బాలక్రిష్ణ ఆశీస్సులు కూడా ఈ వారసుడికి వున్నాయంటూ సెలవిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మత్స్యకారుల జీవన చిత్రాన్ని ఆవిష్కరించే రేవు రిలీజ్ కు రెడీ