Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ నటి నమిత భర్త వీరేంద్ర చౌదరికి నోటీసులు జారీచేసిన తమిళనాడు పోలీసులు

Webdunia
బుధవారం, 15 నవంబరు 2023 (10:18 IST)
హీరోయిన్ నమిత భర్త వీరేంద్ర చౌదరికి తమిళనాడు రాష్ట్ర పోలీసులు నోటీసులు జారీచేశారు. రూ.4 లక్షల నగదు మోసం కేసులో ఆయనకు ఈ నోటీసులు పంపించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కౌన్సిల్ తమిళనాడు విభాగం చైర్మన్ పదవిని ఇప్పిస్తాని నమ్మించి రూ.4 లక్షల మేరకు చౌదరి డబ్బులు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంలో డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు ఈ నోటీసులు జారీచేశారు. 
 
పరిశ్రమల కౌన్సిల్ తమిళనాడు విభాగ అధ్యక్షుడి పదవి ఇప్పిస్తామంటూ సేలం నగరానికి చెందిన ముత్తురామన్ జిల్లాలోని అమ్మాపాళయం జాకిర్ ప్రాంతానికి చెందిన గోపాల స్వామి వద్ద రూ.50 లక్షల నగదు తీసుకుని మోసం చేయగా, ఆ పదవికి నమిత భర్త చౌదరి ఇటీవల నియామకమయ్యారు. తాను మోసపోయినట్లు గోపాల స్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముత్తురామన్‌తో పాటు కౌన్సిల్ జాతీయ కార్యదర్శి దుశ్యంత్ యాదవ్‌ను గత 31వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ నేపథ్యంలో కౌన్సిల్ తమిళనాడు విభాగ అధ్యక్షుడు చౌదరితో పాటు ముత్తురామన్ సహాయకుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా విభాగ ఉపాధ్యక్షుడు మంజునాథ్ కూడా విచారణకు హాజరవ్వాలంటూ సూరమంగళం పోలీసులు సమన్లు పంపారు. అయితే వీరిద్దరూ హాజరు కాలేదు. దీంతో వారిని కూడా ఈ కేసులో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బర్త్ డే పార్టీకి వెళితే మత్తు ఇచ్చి 7 రోజుల పాటు యువతిపై 23 మంది అత్యాచారం

కిడ్నాప్ కేసు : వల్లభనేని వంశీకి షాకిచ్చిన విజయవాడ కోర్టు

అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న మార్క్ శంకర్‌.. ఆర్కే రోజా స్పందన.. ఏంటంటే?

బైకును కారులా మార్చేశాడు.. ఆరుగురితో హ్యాపీగా జర్నీ చేశాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments