Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్ మహారాజా ''నేల టిక్కెట్'' ఆడియోకు పవన్ కల్యాణ్?

మాస్ మహారాజా వరుస పెట్టి లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాలు చేస్తున్నాడు. రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు అంటూ సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న రవితేజ.. తాజాగా నేల టిక్కెట్‌తో రెడీ అయిపోతున్నాడు. ఈ సిన

Webdunia
మంగళవారం, 1 మే 2018 (18:34 IST)
మాస్ మహారాజా వరుస పెట్టి లాంగ్ గ్యాప్ తర్వాత సినిమాలు చేస్తున్నాడు. రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు అంటూ సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్న రవితేజ.. తాజాగా నేల టిక్కెట్‌తో రెడీ అయిపోతున్నాడు. ఈ సినిమా వేసవి కానుకగా రిలీజ్ కానుంది. నేలటిక్కెట్‌ను మే 24న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. 
 
సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్‌.. వేడుక చూద్దాం వంటి కుటుంబ కథా చిత్రాలతో మంచి విజయాలు అందుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడీ మాళవిక శర్మ నటిస్తోంది. ఈలోగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. 
 
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారట. మెగా ఫ్యామిలీతో రవితేజకి గల సాన్నిహిత్యం కారణంగా పవన్ తప్పకుండా వస్తాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ రాకతో ఈ సినిమాకు ఫోకస్ పెరుగుతుందని టాక్ వస్తోంది. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాకి శక్తికాంత్ సంగీతాన్ని అందించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments