Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆచారాల్లో వేలు పెట్టొద్దు... ప్లీజ్.. రజినీకాంత్

Webdunia
ఆదివారం, 21 అక్టోబరు 2018 (12:11 IST)
సుప్రీంకోర్టు తీర్పు మేరకు శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని సినీ సూపర్ స్టార్ రజినీకాంత్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో దేవాలయాల సంప్రదాయాలను, నియమాలను కూడా గౌరవించాలన్నది నా మనవి అని ఆయన వ్యాఖ్యానించారు.
 
ప్రస్తుతం తన 165వ చిత్రం "పేట్టా" షూటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ గత కొద్దిరోజులుగా వార‌ణాసిలో జ‌రిగింది. అనుకున్న స‌మ‌యానికంటే 15 రోజుల ముందే షెడ్యూల్ పూర్తి చేశారు. దీంతో త‌న ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు. 
 
త‌న ట్విట్ట‌ర్‌లో 'పేట్టా' సినిమాని అనుకున్న స‌మ‌యానికంటే 15 రోజుల ముందే పూర్తి చేసాం అని తెలిపారు. ఇది టీమ్ స‌మిష్టి కృషి అన్నారు. ఆగ‌స్టు 19న ట్వీట్ చేసిన ర‌జ‌నీ మ‌ళ్ళీ అక్టోబ‌ర్ 19న ట్వీట్ చేయ‌డం విశేషం. 
 
పేట్టా షెడ్యూల్ పూర్తి చేసుకొని చెన్నై చేరుకున్న ర‌జ‌నీకాంత్‌ని మీటూ ఉద్య‌మంతో పాటు శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మ‌హిళ‌ల ప్ర‌వేశం గురించి విలేకరులు ప్ర‌శ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ, మీటూ ఉద్య‌మం స‌క్ర‌మ మార్గంలో వెళితే మంచిది. దానిని దుర్వినియోగం చేయ‌కూడ‌దన్నారు. 
 
ఇకపోతే, పేట్టా చిత్రంలో కార్తీక్ సుబ్బ‌రాజు తెర‌కెక్కిస్తుండ‌గా ఈ చిత్రంలో సిమ్రాన్, త్రిష, విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, మేఘా ఆకాష్, సతన్‌రెడ్డి, మాళవికా మోహనన్‌లతో పాటు డైరెక్టర్లు మహేంద్రన్, శశికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. 
 
ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, రజనీకాంత్‌ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని టాక్‌. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించిన ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాయనాడ్‌లో 48,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ప్రియాంకా గాంధీ

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్-బీజేపీల మధ్య పోరు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు.. ఆధిక్యంలో బీజేపీ.. ట్రెండ్స్ మారితే?

మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు.. అప్పుడే మొదలైన చర్చ?

జార్ఖండ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం.. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments