Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితిన్, రష్మిక మందన చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభం

Webdunia
మంగళవారం, 6 జూన్ 2023 (15:32 IST)
Venky Kudumula, GV Prakash Kumar, Shyam Kasarla
హీరో నితిన్, రష్మిక మందన, మేకర్ వెంకీ కుడుముల కాంబినేషన్‌లో #VNRTrio ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్‌ తో రూపొందుతోంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర బృందం చెన్నైలో మ్యూజిక్ సిట్టింగ్‌ లను ప్రారంభించింది. ప్రముఖ లిరిక్ రైటర్ శ్యామ్ కాసర్ల కూడా #VNRTrio లో చేరారు. పనులు శరవేగంగా ప్రారంభమయ్యాయి. ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు పండగలా వుండబోతుంది.
 
ఈ చిత్రంలో నితిన్ స్టైలిష్ గా కనిపిస్తుండగా, రష్మిక మందన అల్ట్రా-మోడరన్ లుక్‌ లో కనిపించనుంది. నితిన్, రష్మిక పుట్టినరోజుల సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.  నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపిస్తారు.
 
సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments