Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రష్మిక మందన నాయికగా రెయిన్‌బో ప్రారంభం

Dev, rashmika clap by amala
, సోమవారం, 3 ఏప్రియల్ 2023 (19:22 IST)
Dev, rashmika clap by amala
రష్మిక మందన ప్రధాన పాత్రలో బ్రీజీ రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్ టైనర్  'రెయిన్‌బో' చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్  ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు అనౌన్స్ చేశారు.  ప్రారంభం నుంచి డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ, దాని విలక్షణమైన కథాంశాలు, నాణ్యమైన నిర్మాణ విలువలకు పేరుపొందింది. ఖాకీ, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం (OOJ) వంటి సినిమాలతో సంస్థ అసాధారణమైన విజయాల్ని వరుసగా అందిస్తుంది.
 
webdunia
Rashimika, prabhu, suresh babu
రష్మిక మందన్న ప్రధాన పాత్రలో 'రెయిన్‌బో' అన్ని వర్గలా ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ అనుభూతిని కలిగించనుంది. నూతన దర్శకుడు శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు గ్రాండ్ గా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అమల అక్కినేని క్లాప్ కొట్టగా, అల్లు అరవింద్ కెమరా స్విచాన్ చేయగా, సురేష్ బాబు స్క్రిప్ట్ అందించారు. సందీప్ కిషన్, శరత్ మరార్, సుప్రియ అక్కినేని, బాపి, వెంకీ కుడుముల, కె కె రాధా మోహన్, దామోధర్ ప్రసాద్,  దర్శకుడు శశికిరణ్, రిలయన్స్ శ్రీధర్, జెమినీ కిరణ్ హాజరై టీంకు బెస్ట్ విశేష్ అందించారు.
 
నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, భాస్కరన్ సినిమాటోగ్రఫీ.. ఈ రెండూ సినిమాలోఆకర్షణగా వుండబోతున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైన్ ఇన్‌ఛార్జ్‌గా పని చేస్తున్నారు.
 
ప్రారంభోత్సవం సందర్భంగా రష్మిక మాట్లాడుతూ..  'రెయిన్‌బో' కోసం చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను. దర్శకుడు దర్శకుడు శాంతరూపన్ అద్భుతమైన కథతో వచ్చారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు. టీం అందరితో కలసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను’’ అన్నారు  
 
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాత..  'ఒకే ఒక జీవితం' తర్వాత మరో మంచి కథతో మీ ముందుకు రాబోతున్నాం. దర్శకుడు శాంతరూపన్ చాలా మంచి కథని రాసుకున్నారు. రష్మిక గారికి కృతజ్ఞతలు. మంచి టెక్నికల్ టీం, సరికొత్త కథాంశంతో రాబోతున్న 'రెయిన్‌బో' కూడా తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుందని నమ్ముతున్నాం " అన్నారు  
 
దర్శకుడు శాంతరూపన్.. ప్రభు గారు ఒక కథ ఓకే చేస్తే ఎలా వుంటుందో అందరికీ తెలుసు  'రెయిన్‌బో' అంతే అద్భుతంగా వుంటుంది. ఈ కథని అంగీకరించిన రష్మిక గారికి కృతజ్ఞతలు. టీం అంతా ఎంతో సపోర్ట్ చేస్తోంది. మీకు వండర్ ఫుల్ ప్రాజెక్ట్ ఇవ్వడానికి శ్రమిస్తున్నాం’’ అన్నారు.
 
దేవ్ మోహన్  మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల అభిమానానికి కృతజ్ఞతలు. నా మొదటి సినిమా శాకుంతులం విడుదలకు ముందే ఈ సినిమా ప్రారంభం కావడం ఆనందంగా వుంది.  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్  ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు గారికి థాంక్స్. దర్శకుడు ఈ కథ చెప్పినపుడే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు.
 
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 7, 2023 నుండి ప్రారంభమవుతుంది.
 
తారాగణం: రష్మిక మందన, దేవ్ మోహన్
 
సాంకేతిక విభాగం:
దర్శకత్వం-శాంతరూబన్
డీవోపీ-కె. ఎం. భాస్కరన్
సంగీతం - జస్టిన్ ప్రభాకరన్
ఎడిటర్ - ఇ. సంగతమిళన్
ప్రొడక్షన్ డిజైనర్- వినీష్ బంగ్లాన్
ఆర్ట్ డైరెక్టర్: సుబెంథర్ పిఎల్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: తంగప్రభాకరన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అరవేంద్రరాజ్ బాస్కరన్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
నిర్మాణ సంస్థ: డ్రీమ్ వారియర్ పిక్చర్స్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాని కెరీయర్‌లో బెస్ట్‌ పెర్‌ఫార్మెన్‌ : రాజమౌళి కితాబు