గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం శాకుంతలం. సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంతలంను రూపొందిస్తున్నారు గుణ శేఖర్. శ్రీ వెంకటేశ్వరక క్రియేషన్స్ దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D టెక్నాలజీతో విజువల్ వండర్‌గా తెలుగు, హిందీ, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో శాకుంతలం సినిమా ప్రేక్షకులను అలరించనుంది. మంగళవారం ఈ సినిమా త్రీడీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
Dil Raju, Guna Shekhar, Neelima Guna, Saimadhav Burra, Praveen Pudi
దర్శకుడు గుణ శేఖర్ మాట్లాడుతూ ఇది సమంతగారి శాకుంతలం. ఆమె ప్రాణం పెట్టి శకుంతల పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశారు. రేపు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు చూస్తారు. ఏప్రిల్ 14న మీరు సినిమా చూసి ఏం మాట్లాడాలనుకుంటున్నారో వినాలని ఎదురు చూస్తున్నారు. మహాభారతంలో దుష్యంతుడు, శకుంతల పాత్రలను ఆధారంగా చేసుకుని కాళిదాసుగారు అభిజ్ఞాన శాకుంతలం రాశారు. దాన్ని విజువల్‌గా మీ ముందుకు తీసుకొచ్చే క్రమంలో లింకుల కోసం చిన్న చిన్న ఇంప్రవైజేషన్ చేశాం తప్ప.. దాదాపు 90 ఒరిజినల్ కథనే సినిమాగా తీశాం. ఇప్పుడు ఆడియెన్స్ అభిరుచులు మామూలుగా లేవు. కంటెంట పరంగా ఆడియెన్స్ మన కంటే చాలా ముందున్నారు. ఆడియెన్స్‌ను ఇంప్రెజ్ చేయటమే నా చాలెంజ్. ఏప్రిల్ 14న వస్తున్న ఈ మూవీ తన మార్క్ క్రియేట్ చేసుకుంటుంది. \
దిల్‌రాజుగారు నిత్య విద్యార్థి. ప్రతి రోజూ ఆయన కొత్త విషయాలను నేర్చుకుంటుంటారు. ఆయన నా దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారో నేను కూడా ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన బలగం సినిమాను నిలబెట్టడానికి ట్రాక్టర్ ఎక్కి ట్రావెల్ అయ్యారు. అలాగే గేమ్ చేంజర్ సినిమాలో శంకర్‌గారికి దన్నుగా నిలబడ్డారు. తెలుగు సినిమా ఈరోజు ఇలాగా వెలిగిపోతుందంటే దిల్‌రాజుగారిలాంటి నిర్మాతలే కారణం. సమంతగారితో ఈ సినిమా చేయాలనకున్నప్పుడు ఆ ప్రాజెక్ట్‌లో పార్ట్ కావటానికి చాలా మంది నిర్మాతలు ఆసక్తి చూపించారు. అయితే దిల్ రాజుగారు పార్ట్ అవుతారనగానే నేను ఆసక్తి చూపించాను. అందుకు కారణం మేకర్‌గా ఓ సినిమాను చూసి ఆయన చెప్పేయగలరు. ఆయనలాంటి మేకర్‌ను వాడుకోకపోతే మా మూర్ఖత్వమే అవుతుంది ఇది. ఆయన ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత. ఆడియెన్స్ పల్స్ తెలిసిన నిర్మాత. ఆయన్ని వాడుకోవాల్సిన అవసరం మాకు ఉంది అన్నారు.