Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్య కారణంగా నా కూతురు ప్రాణాలకు హాని: బాలాజి

Webdunia
శుక్రవారం, 1 మార్చి 2019 (12:39 IST)
యాంకర్ దాడి బాలాజీ తన కుమార్తె ప్రాణాలకు హాని ఉందని చెప్తున్నారు. ఈయన భార్య నిత్య మధ్య మనస్పర్థల కారణంగా వీరిద్దరు విడిపోయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే, తమిళ బిగ్‌బాస్ షో కారణంగా కలుసుకున్నారు. మళ్ళీ విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దాడి బాలాజి, నిత్య విడాకులు తీసుకోవడానికి కోర్టు మెట్టెక్కారు. వీరి విడాకుల పిటిషన్ విచారణలో ఉంది. 
 
అయితే.. నిత్య తన భర్త దాడి బాలాజి తనను చిత్రహింసలు పెడుతున్నట్టు, హత్యాబెదిరింపులు చేస్తున్నట్లు వెప్పేరిలోని పోలిస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. దాంతో పోలీస్ వెంటనే బాలాజీకి ఫోన్ చేసి విచారించగా.. నేను షూటింగ్ కారణంగా వేరే ఊరిలో ఉన్ననాని, చెన్నైకి వచ్చాక కలుస్తానని చెప్పారు దాడి బాలాజి. ఈ పరిస్థితుల్లో బాలాజి గురువారం మీడియా ముందుకు వచ్చి.. మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో నా ఎదుగుదలను చూసి నా భార్య నిత్య అసూయ పడుతోందన్నాడు.
 
నిత్య నటి కావాలనే ఆశతో బరువు తగ్గించుకోవడానికి జిమ్‌కు కూడా వెళ్ళుతుంది. అక్కడ జిమ్‌లోని శిక్షకుడితో పరిచయం పెంచుకుందన్నారు. దీన్ని ఖండించిన నేను నా మిత్రుడైన ఎస్‌ఐ మనోజ్‌కు తెలియజేశాను. కానీ, అతను దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. నా కుటుంబాన్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించాడు బాలాజీ.
 
అంతేకాదు.. మనోజ్ నా భార్యకు మోబైల్ ఫోన్ కొనిచ్చాడని, ఆ ఫోన్ ద్వారా వారిద్దరూ మాట్లాడుకుంటున్నారని చెప్పారు. నేను నా భార్యను కలిసి రెండు సంవత్సరాలైంది. అప్పటి నుండి నిత్య నాపై నేరారోపణలు చేస్తూనే ఉందన్నారు. ఇలానే జరుగుతూ ఉంటే నా కూతురు భవిష్యత్ దెబ్బతుందంటూ.. అలానే నిత్య, ఎస్‌ఐ మనోజ్ కారణంగా నా కూతురు ప్రాణానికి హాని కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోందని దాడి బాలాజి చెప్పుకొచ్చారు. 
 
ఈ విషయం గురించి పోలీసులకు చెప్పినా ఎలాంటి చర్యలు వారు తీసుకోవడం లేదని బాధపడ్డారు. నా కూతురిని ఏదైనా రెసిడెంట్ పాఠశాలలో చేర్పిస్తే మంచిది.. ఈ గురించి నేను కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నానని దాడి బాబాజి వెల్లడించారు.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Bihar : పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. పొదల్లో ఒకరి తర్వాత ఒకరు..?

Milla Magee: మిల్లా మాగీపై వేధింపులు.. క్షమాపణలు చెప్పిన కేటీఆర్.. ఓ ఆడపిల్ల తండ్రిగా ఇలాంటివి?

Covid: బెంగళూరులో తొలి కోవిడ్ మరణం నమోదు.. యాక్టివ్‌గా 38 కేసులు

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్ మృతి.. మరొకరి పరిస్థితి విషమం

Lion : సింహంతో ఆటలా? ఆ వ్యక్తికి పంజా దెబ్బ తప్పలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments