Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢం తర్వాత లవర్ బాయ్‌కి వివాహం.. అంతా కరోనా పుణ్యమే

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (10:50 IST)
ఆషాఢం తర్వాత లవర్ బాయ్ నితిన్ తను ప్రేమించిన షాలినితో కలిసి ఏడడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో నితిన్ షాలినిల వివాహం జరిగే అవకాశం ఉందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. కరోనా విజృంభణ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దీంతో నితిన్ పెళ్లిని ఆషాడం పూర్తి అయిన వెంటనే జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
 
హైదరాబాద్ శివారులో ఉన్న ఒక ఫామ్ హౌస్‌లో పెళ్లికి సిద్ధం అవుతున్నారు. అతి కొద్ది మంది బంధు మిత్రులను ఈ పెళ్లికి నితిన్ అండ్ ఫ్యామిలీ ఆహ్వానించబోతున్నారు. కాగా.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ నితిన్ తన ప్రేయసి శాలినితో ఏప్రిల్ 16న పెళ్ళి పీటలెక్కాల్సింది. 
 
కాని కరోనా వారి పెళ్లికి బ్రేక్ వేసింది. దుబాయ్‌లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న నితిన్ కరోనా వలన తన పెళ్లికి తాత్కాలిక బ్రేక్ వేశాడు. ప్రస్తుతం ఆషాఢం తర్వాత నితిన్ వివాహం చేసుకోవాలని డిసైడ్ అయినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంచల్ గూడ జైల్లో అల్లు అర్జున్, క్యాబ్ బుక్ చేసుకుని కోపంతో వెళ్లిపోయిన అల్లు అరవింద్

Revanth Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌లో నా జోక్యం లేదు.. తగ్గేదేలే

Jagan: అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన జగన్మోహన్ రెడ్డి.. క్రిమినల్ కేసు పెట్టడం?

అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ - 4 వారాలు మాత్రమే....

అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం : హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments