Webdunia - Bharat's app for daily news and videos

Install App

''మహానటి''కి దశ తిరిగిందా..? నయనతారకే చెక్ పెట్టిందా...!? (video)

Webdunia
శుక్రవారం, 26 జూన్ 2020 (10:42 IST)
మహానటి కీర్తి సురేష్‌కు దశ తిరిగిందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఎందుకంటే.. ప్రస్తుతం నయనతార ఛాన్సులన్నీ కీర్తి కొల్లగొడుతుందని సమాచారం. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే? దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో గోపీ నైనర్‌ దర్శకత్వంలో 2017లో వచ్చిన తమిళ చిత్రం 'అరమ్‌'. ఈ చిత్రాన్ని తెలుగులో 'కర్తవ్యం' టైటిల్‌తో విడుదల చేశారు. ఈ సినిమాలో కలెక్టర్‌ పాత్రను పోషించిన నయనతారకు ప్రశంసలు లభించాయి. 
 
నయనతార కలెక్టర్ పాత్రలో అదరగొట్టింది. బోరుబావిలో పడ్డ చిన్నారిని కాపాడటం, ఓ ఊరి సమస్యల్ని తీర్చడం చుట్టూ ఉత్కంఠగా సాగే సినిమా ఇది. అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న సినిమాలో నయన్‌ నటించడం లేదని.. కాల్‌షీట్స్ లేకపోవడంతో ఆమె స్థానంలో కీర్తి సురేశ్‌ను ఎంచుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాదు ఈ సినిమాలో కీర్తి కూడా నటించేందుకు సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగాఈ సినిమా దర్శకుడు గోపీ నైనర్‌ స్పందించాడు. 
 
అరమ్‌కు సీక్వెల్‌ తీస్తే.. అది నయనతారతోనే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా వస్తున్న ఎలాంటీ వదంతుల్ని నమ్మొద్దని తెలిపాడు. నయనతార ఇటీవల తెలుగులో చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' నటించింది. నయనతార ప్రస్తుతం 'నెట్రికన్‌', 'కాత్తువాక్కుల రెండు కాదల్‌' వంటి తమిళ సినిమాల్లో నటిస్తోంది. అయితే పెంగ్విన్ సినిమాకు తర్వాత కీర్తి సురేష్‌కు అవకాశాలు వెల్లువల్లా వస్తున్నాయని.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన సర్కారు వారి పాటలో ఆమె హీరోయిన్‌గా కూడా ఎంపికైన విషయాన్ని సినీ పండితులు గుర్తు చేస్తున్నారు. 
 
అరమ్ సినిమా ఛాన్సు కూడా కీర్తిని వరించే అవకాశాలు లేవని దర్శకుడు చెప్పినా.. లేడి ఓరియెంటెడ్ రోల్స్ ప్రస్తుతం కీర్తిని కూడా పలకరిస్తూనే వున్నాయని సినీ పండితులు అంటున్నారు. ఇదే కంటిన్యూ అయితే.. కీర్తి కూడా నయన, సమంతల తరహాలో భారీగా లేడి ఓరియెంటెడ్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నా.. ఆశ్చర్యపోనక్కర్లేదని వారు చెప్తున్నారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

ఖమ్మం: ‘హాస్టల్‌లో నన్ను లెక్కలేనన్ని సార్లు ఎలుకలు కరిచాయి, 15 సార్లు ఇంజెక్షన్ ఇచ్చారు’

Pawan: మన్యం, పార్వతీపురం జిల్లాల్లో పవన్- డోలీలకు స్వస్తి.. గుడి కాదు.. బడి కావాలి.. (videos)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments