Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌చ్చే వారం నుండి `మ్యాస్ట్రో` మ్యూజిక్ ఫెస్ట్

Webdunia
శనివారం, 10 జులై 2021 (13:45 IST)
Nitin
హీరో నితిన్‌, ద‌ర్శ‌కుడు మేర్లపాక గాంధీల ఫస్ట్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న నితిన్ 30వ చిత్రం `మ్యాస్ట్రో`. ఈ క్రైమ్‌ కామెడీ చిత్రంలో నితిన్‌ సరసన నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది.
 
ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌ల పూర్త‌య్యింది. నెక్ట్స్ వీక్ నుండి మ్యాస్ట్రో మ్యూజిక్ ఫెస్ట్ ప్రారంభంకానుంద‌ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో నితిన్ బీచ్‌లో పియానో వాయిస్తూ క‌నిపిస్తున్నారు.
 
నితిన్‌ హిట్‌ మూవీ ‘భీష్మ’కు సంగీతం అందించిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ మహతి స్వరసాగర్ ఈ మ్యాస్ట్రో చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో చార్ట్‌బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్‌ను ఆశించొచ్చు. ఇప్ప‌టికే నితిన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది.
 
శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ‘మ్యాస్ట్రో’ సినిమాకు జె యువరాజ్‌ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ తుదిద‌శ‌కు చేరుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ద‌మైంది.
 
నటీనటులు
నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, జిస్సూ సేన్‌ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి
సాంకేతిక విభాగం
మాట‌లు, ద‌ర్శ‌కత్వం: మేర్లపాక గాంధీ, నిర్మాతలు: ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి, సమర్పణ: రాజ్‌కుమార్‌ ఆకేళ్ళ, కెమెరాః జె యువరాజ్‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments