Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్ సిద్ధార్థ్ -18 పేజెస్ డ‌బ్బింగ్ కార్యక్రమాలు మొదలు

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (15:42 IST)
Nikil dubbing
హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పెజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా వస్తుంది. కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది.
 
ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి. హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన డబ్బింగ్ మొదలు పెట్టారు. ఓ వైపు షూటింగ్ మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఏ వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనున్నారు.
 
దర్శకుడు: పల్నాటి సూర్య ప్రతాప్,  కథ, స్క్రీన్ ప్లే: సుకుమార్, నిర్మాతలు: బన్నీ వాసు, సుకుమార్, సంగీతం: గోపీ సుందర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

Finland woman Raita: ఫిన్‌లాండ్ మహిళ నోట గబ్బర్ సింగ్ పాట.. పవన్ గురించి బాగా తెలుసు (video)

Allu Arjun Issue: చంద్రబాబు సైలెంట్‌.. పవన్ చెప్పడంతో?

మాట తప్పిన జూనియర్ ఎన్టీఆర్.. బోరున విలపిస్తున్న ఓ తల్లి!! (Video)

Mohan Babu: మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ కొట్టివేత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments