Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిఖిల్ 18 పేజీస్ పోస్ట‌ర్‌కు స్పంద‌న‌

నిఖిల్ 18 పేజీస్ పోస్ట‌ర్‌కు స్పంద‌న‌
, బుధవారం, 26 మే 2021 (16:32 IST)
18 pages, Update Poster
అర్జున్ సుర‌వ‌రం హిట్ త‌రువాత‌ హీరో నిఖిల్, మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ అనుప‌మ జంట‌గా `కుమారి 21 ఎఫ్` ఫేమ్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం `18 పేజెస్‌`. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణలో సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ, 100 ప‌ర్సెంట్, భ‌లే  భ‌లే మ‌గాడివోయ్, గీత‌గోవిందం, ప్ర‌తిరోజూపండుగే వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌తో స‌క్స‌స్ కి కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా మారిన నిర్మాత బ‌న్నివాసు నిర్మాత‌గా  జీఏ2పిక్చ‌ర్స్, ఉప్పెన వంటి స‌న్సెషేన‌ల్ హిట్ అందుకుని విజ‌య‌వంతంగా ముందుకు సాగుతున్న సుకుమార్ రైటింగ్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
18 పేజీస్ అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ అనూహ్య స్పంద‌న ల‌భించింది, ఈ నేప‌థ్యంలో జూన్ 1న నిఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అప్ డేట్ పోస్టర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఓ అబ్బాయ్ చేతిలో ఫోను, ఓ అమ్మాయి చేతిలో పెన్ ఉన్న స్టిల్స్ తో ఈ అప్ డేట్ పోస్టర్ విడుద‌ల చేశారు. క్రెజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.
 
స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్క‌థ‌, స్క్రీన్ ప్లే - సుకుమార్డైరెక్ట‌ర్ - ప‌ల్నాటిసూర్య ప్ర‌తాప్నిర్మాత - బ‌న్నీ వాస్మ్యూజిక్ డైరెక్ట‌ర్ - గోపీసుంద‌ర్లైన్ ప్రొడ్యూస‌ర్ - బాబుకెమెరా - వ‌సంత్ఎడిటర్ - న‌వీన్ నూలీర‌చ‌న - శ్రీకాంత్ విస్సాఎక్స్ క్యూటీవ్ ప్రొడ్యూస‌ర్ - శ‌ర‌ణ్ రాప‌ర్తి, అశోక్ బికో డైరెక్ట‌ర్ - రాధా గోపాల్పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇది నా స్క్రీన్‌సేవర్‌గా ఉంచుతున్నానుః కిమ్ క‌ర్ద‌షియ‌న్