Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్, దివ్యాంశ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా లవ్ మెలోడీ సాంగ్

డీవీ
మంగళవారం, 29 అక్టోబరు 2024 (18:11 IST)
Nikhil and Divyansha'
కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ "అప్పుడో ఇప్పుడో ఎప్పుడో" అంటూ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వైవిధ్యభరితమైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బ్లాక్ బస్టర్ దర్శకుడు సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. స్వామి రారా, కేశవ తర్వాత.. నిఖిల్, సుధీర్ వర్మల కలయికలో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ లక్ష్యంగా "అప్పుడో ఇప్పుడో ఎప్పుడో" రాబోతోంది.
 
రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజర్, ఫస్ట్ సింగిల్‌తో టీం అందరినీ ఆకట్టుకుంది. ఫస్ట్ సింగిల్ 'హే తార'కు మంచి స్పందన రావడంతో మ్యూజికల్ ప్రమోషన్స్‌ కూడా ఊపందుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ సెకండ్ సింగిల్ 'నీతో ఇలా' అంటూ సాగే పాటని మంగళవారం నాడు రిలీజ్ చేశారు. ఈ మెలోడియస్ ట్రాక్‌లో నిఖిల్, దివ్యాంశ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది.
 
టాప్ సింగర్ కార్తీక్ అందించిన బాణీ.. రాకేందు మౌళి సాహిత్యం.. కార్తీక్, నిత్యశ్రీ గాత్రం ఈ మెలోడీ గీతాన్ని మరింత ప్రత్యేకంగా, అద్భుతమైనదిగా చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. సీనియర్  నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించారు. యోగేష్ సుధాకర, సునీల్ షా, రాజా సుబ్రమణ్యం ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కన్నడ నటి రుక్మిణి వసంత్ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతోంది.
 
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను బాపినీడు బి సమర్పిస్తున్నారు. సింగర్ కార్తీక్ పాటలు కంపోజ్ చేస్తుండగా, సన్నీ ఎంఆర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని, నవీన్ నూలి ఎడిటింగ్‌ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో నవంబర్ 8న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మైదానంలోనే మృతి చెందిన యువకుడు

మానవ్ శర్మ ఆత్మహత్య కేసు: భార్య, మామను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఎందుకంటే?

ఇద్దరి పిల్లల్ని కట్టేసి మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్, కండక్టర్, క్లీనర్

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments