Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్‌ 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్ కి విశేష స్పంద‌న‌

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (18:56 IST)
18 pages look
అర్జున్ సుర‌వ‌రం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ హిట్ త‌రువాత‌ యంగ్ డైన‌మిక్ హీరో నిఖిల్, మ‌ళ‌యాలీ ముద్దుగుమ్మ అనుప‌మ జంట‌గా కుమారి 21 ఎఫ్ ఫేమ్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం 18 పేజీస్. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణలో స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ, 100 ప‌ర్సెంట్, భ‌లే  భ‌లే మ‌గాడివోయ్, గీత‌గోవిందం, ప్ర‌తిరోజూపండుగే వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌తో స‌క్స‌స్ కి కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా మారిన బ‌న్నివాసు నిర్మాత‌గా జీఏ2పిక్చ‌ర్స్ సుకుమార్ రైటింగ్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
18 పేజీస్ అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ అనూహ్య స్పంద‌న ల‌భించింది, అలానే స్టార్ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండ‌టం, కుమారి 21 ఎఫ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావ‌డంతో, నిఖిల్, అనుప‌మ కాంబినేష‌న్, జీఏ2 పిక్చ‌ర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణం వెర‌సి 18 పేజీస్ ప్రాజెక్ట్ పై అంద‌రి అస‌క్తి మ‌రింత పెంచుతున్నాయి. 
 
ఈ నేప‌థ్యంలో జూన్ 1న నిఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు. నిఖిల్ క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టి, వాటి పై అనుప‌మ..
 
"నా పేరు నందిని
నాకు మొబైల్ లో అక్ష‌రాలను టైప్ చెయ్య‌డం క‌న్నా
ఇలా కాగితం పై రాయ‌డం ఇష్టం
టైప్ చేసే అక్ష‌రాల‌కి ఎమోష‌న్స్ ఉండ‌వు
ఎవ‌రు టైప్ చేసినా ఒకేలా ఉంటాయి, కానీ
రాసే ప్ర‌తి అక్ష‌రానికి ఒక ఫీలింగ్ ఉంటుంది
దానీ పై నీ సంత‌కం ఉంటుంది
నాకెందుకో ఇలా చెప్ప‌డ‌మే బాగుంటుంది"
అని రాస్తున్న ఉన్న స్టిల్ తో ఈ పోస్టర్ ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. క్రెజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.
 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments