Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్ 18 పేజీస్ కు స్పంద‌న‌

Webdunia
శనివారం, 29 మే 2021 (13:00 IST)
Nikil 18pages
ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం `18 పేజీస్`. మెగాప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణలో స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ, సుకుమార్ రైటింగ్స్ తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 18 పేజీస్ అనే టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ అనూహ్య స్పంద‌న ల‌భించింది, అలానే స్టార్ ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తుండ‌టం, కుమారి 21 ఎఫ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌రువాత ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావ‌డంతో, నిఖిల్,  అనుప‌మ కాంబినేష‌న్, జీఏ2 పిక్చ‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణం వెర‌సి 18 పేజీస్ ప్రాజెక్ట్ పై అంద‌రి అస‌క్తి మ‌రింత పెంచుతున్నాయి. 
 
ఈ నేప‌థ్యంలో జూన్ 1న నిఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా 18 పేజీస్ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన అప్ డేట్ పోస్టర్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా 18 పేజీస్ ప్రీ లుక్ విడుదల చేశారు, నిఖిల్ క‌ల్ట్ లుక్స్ తో ఉన్న స్టిల్ తో ఈ పోస్టర్ ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ తో పాటు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. క్రెజీ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపీ సుంద‌ర్ సంగీత ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవ్వ‌నున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

తర్వాతి కథనం
Show comments