Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప" నుంచి మరో అప్డేట్ : కొత్త స్టిల్ రిలీజ్

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (11:30 IST)
అల్లు అర్జున్ - కె.సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప". రష్మిక మందన్నా హీరోయిన్. ఈ చిత్రం నుంచి మరో అప్డేట్‌ను ఆదివారం వెల్లడించారు. ఈ చిత్రంలోని నాలుగో పాటను నవంబరు 19న రిలీజ్​ చేయనున్నట్లు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది. ఇందులోని అల్లు అర్జున్​ కొత్త లుక్​ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.
 
'పుష్ప' సినిమా విడుదల తేదీ దగ్గర పడే కొద్ది చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్​లను వరుసగా ప్రకటిస్తూ ఫ్యాన్స్​లో జోష్​ నింపుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో అదిరిపోయే అప్డేట్​ ఇచ్చింది. ఈ చిత్రంలోని నాలుగో పాట 'ఏయ్​ బిడ్డ​ ఇది నా అడ్డ'ను నవంబరు 19న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపుతూ ఓ కొత్త పోస్టర్​ను విడుదల చేసింది. 
 
ఇందులోని అల్లు అర్జున్​ కొత్త లుక్​ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. నుదుటన బొట్టు, ఒంటినిండా బంగారపు చైన్లు, ఉంగరాలతో కళ్లజోడు పెట్టుకుని సరికొత్త అవతారంలో కనిపించారు. కాగా, ఈ చిత్రం భారీ బడ్జెట్‌ చిత్రంగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. 
 
ఇందులో బన్నీ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక సందడి చేయనున్నారు. ప్రతినాయకుడిగా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 
 
'పుష్ప ది రైజ్‌' పేరుతో మొదటి భాగాన్ని డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, గ్లింప్స్​ ఫ్యాన్స్​ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments