Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌ తరుణ్ - లావణ్య - మాల్వీ మల్హోత్రా ఎపిసోడ్‌లో సరికొత్త ట్విస్ట్

వరుణ్
మంగళవారం, 16 జులై 2024 (12:14 IST)
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, ఆయన ప్రియురాలి లావణ్య, యంగ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఎపిసోడ్‌లో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ స్టోరీలోకి మరో కొత్త పాత్ర ప్రవేశించింది. తన కుమారుడు యాగేశ్, మాల్వీ మల్హోత్రా ట్రాప్ చేసి ఆస్తి కాజేసిందని ముంబైకు చెందిన నిర్మాత తల్లి సంచలన ఆరోపమలు చేసింది. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. యాగేశ్, మాల్వీ కాల్ లిస్టు కూడా ఆమె బయట పెట్టారు.
 
ఆ వీడియోలో ఉన్న సారాంశాన్ని పరిశీలిస్తే, యోగేశ్ ముంబైలో ఓ చిన్న నిర్మాత. తన చిత్రంలో నటించడానికి వచ్చిన మాల్వీతో ప్రేమలో తన కుమారుడు ప్రేమలోపడ్డాడు. వీళ్లిద్దరూ రెండేళ్లపాటు సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, తనని పెళ్లి చేసుకోవడానికి యోగేశ్ నిరాకరించాడనీ, కత్తితో తనపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడనీ ఆరోపిస్తూ మాల్వీ కేసు పెట్టడంతో యోగేశ్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
నాలుగేళ్లుగా మాల్వీ తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతోందని, తప్పుడు కేసులు పెట్టి తన కుమారుడిని జైలుకి పంపించిందని యోగేశ్ తల్లి వెల్లడించారు. రాజ్ తరుణ్, లావణ్య కేసులో మాల్వీ ఇన్వాల్వ్ అయిన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నాననీ, అందుకే మాల్వీ బండారం బయటపెట్టాలని వీడియో విడుదల చేస్తున్నాననీ, తన కొడుకు ఇంకా జైలులోనే ఉన్నాడనీ, మాల్వీ అతని కెరీర్‌ను సర్వనాశనం చేసిందని చెబుతూ యోగేశ్ తల్లి బోరున విలపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

కొండాపూర్‌లో రేవ్ పార్టీ... 50 ఓజీ కుష్ గంజాయి వినియోగం...

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments