రవితేజ, సునీల్ ఇలా చాలామంది అగ్ర హీరోలు, కమేడియన్లకు మేనేజర్ గా వున్న సీనియర్ నటుడు రాజారవీంద్ర. ఈయన ఇప్పుడు హాట్ టాపిక్ వున్న హీరో రాజ్ తరుణ్ కూడా మేనేజర్. పలు సినిమాలను రాజారవీంద్ర ద్వారా రాజ్ తరుణ్ కు వచ్చిన సందర్భాలున్నాయి. అయితే ఆయనో తెలీని మరో కోనం వుందంటూ తాజాగా రాజా రవీంద్ర స్టేట్ మెంట్ ఇచ్చాడు. నేడు సారంగదరియా సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఆయన్ను ఒకసారి కదిలిస్తే పర్సనల్ గా కొన్ని విషయాలు చెప్పీచెప్పకుండానే చెప్పాడు.
రాజ్ తరుణ మీపై గతంలో కేసు పెట్టాడుగదా? అని అడిగితే.. ఆయన కాదు. నేను కేసు పెట్టానంటూ రాజారవీంద్ర తెలిపాడు. కొన్ని పర్సనల్ విషయాలను హీరోలు డీల్ చేసుకోవడం కుదరకపోతే మేనేజర్ అనేవాడు డీల్ చేస్తాడు. గతంలో రాజ్ తరుణ్ నా దగ్గర నుంచి డబ్బు లాగాలని ఫోన్ లో ఏదేదో మాట్లాడాడు. అప్పటికే సెలబ్రిటీ గనుక ఏదేదో మాట్లాడేవాడు. తన గురించి వ్యక్తిగతంగా తెలుసు. అందుకే ఆయనకు దూరంగా వుండాలని బయటకు వచ్చేశాను. ఆ తర్వాత రాజ్ తరుణ్ పై నేను కేసు పెట్టా. అప్పుడు ఆయన అందుబాటులో లేడు. ఆ కేసు ఇంకా రన్నింగ్ లోనే వుంది. ఇప్పుడు లావణ్య అనే అమ్మాయితో పెద్ద రచ్చే అయింది. ఏదిఏమైనా మనం ఏది చేస్తే అదే వెంటాడుతుంటుంది అని క్లుప్తంగా ముగించాడు రాజారవీంద్ర.