Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజ్ తరుణ్ తిరగబడరసామీ చిత్రం యూత్ ను అలరించేనా ?

Advertiesment
Raj Tarun,  Malvi Malhotra

డీవీ

, గురువారం, 11 జులై 2024 (19:34 IST)
Raj Tarun, Malvi Malhotra
రాజ్ తరుణ్ హీరోగా, మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోన్న 'తిరగబడరసామీ' ఆగస్ట్ 2న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత మల్కాపురం శివకుమార్ ప్రకటించారు. ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్  . సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై ఈ చిత్రం రూపొందింది.

యూత్ ని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. 
 
ఇటీవలే రాజ్ రాజ్ తరుణ్ వివాహం వివాదాలకు దారితీసింది. ఇది సినిమా పై ప్రభావం పడుతుందో లేదో చూడాలి. 
 
సెన్సేషనల్ బ్యూటీ మన్నారా చోప్రా ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ లో అలరించబోతుంది. మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రలు పోషించారు. 
 
ఈ చిత్రానికి జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరలక్ష్మి శరత్‌కుమార్, నికోలాయ్ సచ్‌దేవ్ పెండ్లి సందడి