నేను స్టూడెంట్ సార్ అంటోన్న భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (19:14 IST)
Avantika Dassani
ఇటీవల విడుదలైన 'స్వాతిముత్యం'తో ఆకట్టుకున్న హీరో బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమాగా ''నేను స్టూడెంట్ సార్!' అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నంబర్ 2 గా వస్తున్న చిత్రమిది. తొలి చిత్రం 'నాంది' విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ గా విజయవంతమైంది. 'నాంది’ సతీష్ వర్మ  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాఖీ ఉప్పలపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య కథను అందించారు.
 
ఇటివలే ఈ చిత్రానికి సంబధించిన విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో గణేష్ టెర్రిఫిక్ గా కనిపించారు. ఈ రోజు.. అవంతిక దస్సానిని ఈ చిత్రంలో హీరోయిన్ గా పరిచయం చేశారు. ఇందులో ఆమె పాత్ర పేరు శృతి వాసుదేవన్. అలనాటి నటి భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని 'నేను స్టూడెంట్ సర్' సినిమాతో అరంగేట్రం చేస్తోంది. ఫస్ట్ లుక్ లో స్టైలిష్ అండ్ క్యూట్‌గా కాలేజీ స్టూడెంట్‌గా కనిపిస్తోంది.
 
సముద్రఖని, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అనిత్ మధాడి డీవోపీగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు.
సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
 
నటీనటులు: బెల్లంకొండ గణేష్, అవంతిక దస్సాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆటో రాంప్రసాద్, చరణ్‌దీప్, ప్రమోధిని, రవి సాయితేజ తదితరులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ నెయ్యి కేసు: తితిదే జీఎం కె సుబ్రహ్మణ్యం అరెస్ట్, వైవీ సుబ్బారెడ్డిని కూడానా?

సైక్లోన్ దిత్వా వచ్చేస్తోంది.. తమిళనాడులో భారీ వర్షాలు.. శనివారం నాటికి..

కేటీఆర్ ఐరన్ లెగ్.. అందుకే కవిత పార్టీ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.. కడియం శ్రీహరి

మైండ్‌లెస్ మాటలు మాట్లాడేవారు ఉపముఖ్యమంత్రులవుతున్నారు: జగదీష్ రెడ్డి (video)

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments